• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్క్విడ్ గేమ్ 2 టీజర్…...

స్క్విడ్ గేమ్ 2 టీజర్… ఎలా ఉందంటే

| కొరియన్ డ్రామా, థ్రిల్లర్ సిరీస్ లకి ఓటీటీలలో మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది.

By - Tupaki Desk
Update: 2024-11-01 05:42 GMT

కొరియన్ డ్రామా, థ్రిల్లర్ సిరీస్ లకి ఓటీటీలలో మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. వాటిలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకున్న వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ 2021లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక వ్యూవర్ షిప్ ని సొంతం చేసుకుంది. ఏకంగా 111 మిలియన్ వ్యూవ్స్ ని సొంతం చేసుకుంది. దీనికి కొనసాగింపుగా ‘స్క్విడ్ గేమ్ 2’ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. తాజాగా ఈ సిరీస్ టీజర్ ని నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసింది.

‘స్క్విడ్ గేమ్’ మొదటి సీజన్ తరహాలోనే ఇందులో కూడా రెడ్ అండ్ గ్రీన్ లైట్ గేమ్స్ ఉన్నాయి. అలాగే గేమ్ లో పార్టిసిపేట్ చేసేవారిని లక్ష్యంగా చేసుకొని చంపుతూ ఉంటారు. గేమ్ లో పార్టిసిపేట్ చేసేవారికి తప్పనిసరిగా ఒక్కో రౌండ్ పూర్తి చేసుకొని ముందుకి వెళాల్సిన సిచువేషన్ ని క్రియేట్ చేస్తారు. ఓ వైపు ప్రాణాలు కాపాడుకోవడం, మరో వైపు డబ్బు వస్తుందనే ఆశతో పాల్గొన్న అందరూ గేమ్ ఆడుతారు.

‘స్క్విడ్ గేమ్ 1’ లో విన్నర్ గా నిలిచిన 456వ పోటీదారుడు ‘స్క్విడ్ గేమ్ 2’ లో కూడా ఉన్నాడు. ఈ గేమ్ ఆడటం ప్రమాదకరం అని అతను హెచ్చరించిన కూడా అతని మాట వినకుండా అందరూ ముందుకి వెళ్తారు. ఫైనల్ గా విలన్స్ ఆడే ఈ ప్రాణాంతక గేమ్ లో ఎవరు విన్నర్ గా నిలుస్తారు. గేమ్ నుంచి తమని తాము ఎలా కాపాడుకుంటారు అనే ఎలిమెంట్స్ తో ఈ ‘స్క్విడ్ గేమ్ 2’ కూడా చాలా ఇంటరెస్టింగ్ గా చూపించబోతున్నట్లు టీజర్ బట్టి అర్ధమవుతోంది.

‘స్క్విడ్ గేమ్ 1’ సూపర్ హిట్ కావడంతో ‘స్క్విడ్ గేమ్ 2’ పైన కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కచ్చితంగా ఇది అంచనాలకి మించి ఆదరణని సొంతం చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ‘స్క్విడ్ గేమ్’ సిరీస్ ని సిద్ధం చేయడానికి 12 ఏళ్ళు పట్టింది. అయితే 12 రోజుల్లో మా కష్టానికి తగిన ఫలితం వచ్చింది. మొదటి సిరీస్ తరహాలోనే ‘స్క్విడ్ గేమ్ 2’ కూడా అందరిని అలరిస్తుందని మేకర్స్ తెలిపారు. డిసెంబర్ 26న ఇది రిలీజ్ కానుంది. టీజర్ రిలీజ్ కావడంతో ఈ ‘స్క్విడ్ గేమ్ 2’ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Full View
Tags:    
  • Squidgame2 
  • SeongGihun 
  • Teasertalk 
  • Squidgame 
  • Netflix 
  • Trendingnews 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS