అద్దె ఇవ్వకకుండా ప్రముఖ సింగర్ కు సహాయ దర్శకుడి బెదిరింపులు

ఇంటిని అద్దెకు ఇచ్చిన ప్రముఖ సింగర్ ఎస్పీ చరణ్ కు చేదు అనుభవం ఎదురైంది.;

Update: 2025-09-08 05:45 GMT

ఇంటిని అద్దెకు ఇచ్చిన ప్రముఖ సింగర్ ఎస్పీ చరణ్ కు చేదు అనుభవం ఎదురైంది. ప్రముఖ గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ సుపరిచితుడే. చెన్నైలో తమకున్న ఒక ఇంటిని సినీ సహాయ దర్శకుడికి అద్దెకు ఇచ్చారు. సాలిగ్రామంలోని సత్యా గార్డెన్ లో ఉన్న అపార్టుమెంట్ లో వీరికి ఒక ఫ్లాట్ ఉంది.

అందులో తమిళ చిత్రపరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసే తిరుజ్ఞానం అద్దెకు ఉండేవారు. నెలకు రూ.40,500 చొప్పున అద్దె చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్న అతను..అడ్వాన్సుగా రూ.1.50 లక్షలు ఇచ్చారు. మొదట్లో అద్దె బాగానే చెల్లించినా.. తర్వాత చెల్లించటం మానేశాడు. గడిచిన పాతిక నెలలుగా అద్దె చెల్లించని పరిస్థితి.

దీంతో.. అద్దె గురించి అడిగితే అసభ్యంగా మాట్లాడటమే కాదు.. ఉల్టాగా బెదిరింపులకు పాల్పడటం షురూ చేశాడు. ఈ నేపథ్యంలో అతగాడిపై చర్యలు తీసుకోవాలని.. అద్దె డబ్బులు ఇప్పించి ఇంటిని ఖాళీ చేయించాలంటూ పోలీసుల్ని ఆశ్రయించారు. దీనిపై ప్రాథమిక ఆధారాలు సేకరించిన పోలీసులు ఎస్పీ చరణ్ ఇచ్చిన ఫిర్యాదును కేసు కట్టి విచారిస్తున్నారు. అద్దెకు దిగి ఉల్టా వార్నింగ్ లు ఇస్తున్న సహాయ దర్శకుడి తీరును తప్పు పడుతున్నారు.

Tags:    

Similar News