2027:టాప్ క్రేజీ పాన్ ఇండియా మూవీస్ ఇవే!

పాన్ ఇండియా సినిమాల ప్ర‌వాహం త‌రువాత ఎక్క‌డా చూసినా, ఏ నోట విన్నా వినిపిస్తున్న మాట సౌత్‌..సౌత్‌.;

Update: 2026-02-10 15:30 GMT

పాన్ ఇండియా సినిమాల ప్ర‌వాహం త‌రువాత ఎక్క‌డా చూసినా, ఏ నోట విన్నా వినిపిస్తున్న మాట సౌత్‌..సౌత్‌.. బాలీవుడ్ ప్ర‌భావం భారీగా త‌గ్గ‌డం, క్రేజీ స్టార్ల సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ డిజాస్ట‌ర్లుగా మార‌డంతో సౌత్‌తో పాటు నార్త్ ప్రేక్ష‌కులు కూడా ఇప్ప‌డు సౌత్ సినిమాల జ‌పం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఏడాది సౌత్ నుంచి భారీ క్రేజీ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌బోతున్నాయి. వేల కోట్ల మేర బిజినెస్ చేయ‌డానికి రెడీ అవుతున్నాయి. అందులో టాప్ 4 సినిమాల‌పై ఇప్పుడు ప్ర‌త్యేక‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది.

2027లో అత్యంత హైప్‌పి సొంతం చేసుకున్న సినిమాలు ర‌జ‌నీ-క‌మ‌ల్‌ల కాంబినేష‌న్‌ల రానున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ ఒక‌టి. ఇదే త‌ర‌హాలో అల్లు అర్జున్‌, అట్లీల కాంబినేష‌న్‌లో రూపొందుతున్న భారీ పాన్ వ‌ర‌ల్డ్ మూవీ మ‌రొక‌టి. జ‌క్క‌న్న‌, సూప‌ర్ స్టార్ మహేష్‌బాబుల తొలి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న `వార‌ణాసి` మూడ‌వ‌ది. క్రేజీ సినిమాల‌తో ద‌ర్శ‌కుడిగా ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్న సందీప్‌రెడ్డి వంగ‌, ప్ర‌భాస్ క‌ల‌యిక‌లో రూపొందుతున్న మోస్ట్ యాంటిసీపేటెడ్ మూవీ `స్పిరిట్‌` నాలుగ‌వ‌ది.

ఈ వ‌రుస‌లో ర‌జ‌నీ- క‌మ‌ల్ మూవీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిందే. దాదాపు 46 విరామం త‌రువాత మ‌ళ్లీ వీరిద్ద‌రు క‌లిసి చేస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీగా దీన్ని చెబుతున్నారు. డార్క్ కామెడీ యాక్ష‌న్ డ్రామాగా రూపొంద‌నున్న ఈ మూవీకి `జైల‌ర్‌` డైరెక్ట‌ర్ నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఇటీవ‌లే దీనికి సంబంధించిన ఓ ప్రోమోని కూడా షూట్ చేసిన‌ట్టుగా తెలిసింది. ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలున్నాయి. 80వ ద‌శ‌కం నేప‌థ్యంలో సాగే యాక్ష‌న్ డ్రామాగా దీన్ని నెల్స‌న్ తెర‌కెక్కించ‌బోతున్నాడు. బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జ‌ర‌గ‌నున్న ఈ మూవీ 2027లో వ‌న్ ఆఫ్ ద టాప్ టాక్డ్ మూవీగా నిలుస్తుంద‌ని తెలుస్తోంది.

`పుష్ప 2` వంటి పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత బ‌న్నీ కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ డైరెక్ష‌న్‌లో భారీ పాన్ వ‌ర‌ల్డ్ మూవీకి శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే. దీపిక ప‌దుకునే మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీని హాలీవుడ్ స్టార్ సూప‌ర్ హీరో మూవీగా తెర‌కెక్కిస్తున్నారు. స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే అత్యంత భారీ బ‌డ్జెట్ ఫిల్మ్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్న‌, మృణాల్ ఠాకూర్‌, జాన్వీ క‌పూర్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ర‌ష్మిక ఇప్ప‌టికే సెట్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డం, యాక్ష‌న్ ఘ‌ట్టాల్లో పాల్గొన‌డంతో సినిమాపై అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి. హాలీవుడ్ టెక్నీషియ‌న్‌లు ఈ మూవీకి వ‌ర్క్ చేస్తున్నారు.

ఇది వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, జ‌క్క‌న్న‌ల తొలి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న మూవీ `వార‌ణాసి`. పృథ్వీరాజ్ సుకుమార‌న్ కీల‌క విల‌న్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా గ్లోబ‌ల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌కాష్ రాజ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించనున్న ఈ మూవీని టైమ్ ట్రావెల్‌, మైథ‌లాజిక‌ల్ డ్రామాగా రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నాడు. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన ఈ మూవీ వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.

ప్ర‌భాస్ న‌టిస్తున్న భారీ యాక్ష‌న్ డ్రామా `స్పిరిట్‌`. సందీప్‌రెడ్డి వంగ ద‌ర్శ‌కుడు. ప్ర‌కాష్‌రాజ్, కాంచ‌న‌, వివేక్ ఓబెరాయ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌. ప్ర‌భాస్ ఫ‌స్ట్ టైమ్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డ్స్‌ని తిర‌గ‌రాయాల‌ని సందీప్‌రెడ్డి వంగ ప్లాన్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చి 5న పాన్ ఇండియా మూవీగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. వీటితో పాటు `రామ‌య‌ణ 2` కూడా వ‌చ్చే ఏడాదే రానుంది. 2027 దీపావ‌ళికి ఈ భారీ మూవీని రిలీజ్ చేయ‌బోతున్నారు. ఫ‌స్ట్ పార్ట్ 2026 దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 8న రిలీజ్ కాబోతోంది.

Tags:    

Similar News