మైత్రితో తమిళ స్టార్ వారసుడు.. ఇది గోల్డెన్ ఛాన్స్
ఇప్పటిదాకా ఆదిత్య వర్మ, మహాన్ లాంటి సినిమాల్లో కాస్త భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ వచ్చిన ధృవ్, ఈసారి పక్కా కమర్షియల్ జోనర్ వైపు అడుగులు వేయడం ఇంట్రెస్టింగ్ పాయింట్.
కోలీవుడ్ యంగ్ హీరో ధృవ్ విక్రమ్ కొత్త సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలతో మొదలైంది. డివి4 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఆదిత్య వర్మ, మహాన్ లాంటి సినిమాల్లో కాస్త భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ వచ్చిన ధృవ్, ఈసారి పక్కా కమర్షియల్ జోనర్ వైపు అడుగులు వేయడం ఇంట్రెస్టింగ్ పాయింట్.
టాలీవుడ్ లో భారీ సినిమాలు తీసే మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వాళ్ళ ప్రొడక్షన్ లో వస్తున్న నాలుగో తమిళ ప్రాజెక్ట్ కావడంతో మైత్రీతమిళ్04 అనే ట్యాగ్ తో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కోలీవుడ్ మార్కెట్ పై కూడా గట్టిగా ఫోకస్ పెట్టిన ఈ సంస్థ, వరుసగా ఇలాంటి క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేస్తూ అక్కడ తమ బ్రాండ్ ని మరింత స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేసుకునే పనిలో ఉంది.
ఇక సీనియర్ హీరో విక్రమ్ కి మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏళ్లుగా క్రేజ్ ఉంది. కానీ ఆయన కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన ధృవ్ ఇంతవరకు తెలుగు ఆడియెన్స్ కి చేరువయ్యేలా సరైన ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడు మైత్రీ లాంటి పెద్ద లోకల్ సంస్థతో చేతులు కలపడం అతనికి కచ్చితంగా కలిసొచ్చే అంశం. మైత్రీ బ్రాండ్ ఇమేజ్ తో పాటు వాళ్ళ నెట్ వర్క్ ద్వారా తెలుగులో కూడా ధృవ్ కి ఒక కొత్త మార్కెట్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఈ చిత్రానికి కరణ్ ఏ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనే స్వయంగా రైటర్ శబితో కలిసి ఈ కథను సిద్ధం చేశారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నడిచే సినిమా కాబట్టి ఫైట్స్ కి చాలా ప్రాధాన్యత ఉంటుందట, అందుకే యాక్షన్ కొరియోగ్రాఫర్ గా వీఎం మోర్ కి బాధ్యతలు అప్పగించారు. విక్కీ కెమెరామెన్ గా, చియా ఎడిటర్ గా, ప్రవీణ్ రాజా కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తున్న ఈ సినిమాలో పృథ్వీ, సాయి దీన లాంటి నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక సినిమా పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బయటకొచ్చాయి. ధృవ్ విక్రమ్ సింపుల్ క్యాజువల్ లుక్ తో ఈ ఈవెంట్ కి హాజరయ్యాడు. ముహూర్తం షాట్ కి సంబంధించిన క్లాప్ బోర్డ్ ఫొటోలతో అఫీషియల్ గా సినిమా పనులు మొదలైనట్లు ఫ్యాన్స్ కి ఒక క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా చిత్ర యూనిట్ అంతా సైలెంట్ గా పనులు మొదలుపెట్టారు.
ఈ మధ్య కాలంలో కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలో కూడా మేకింగ్ లో కొత్తదనం ఉంటేనే థియేటర్లలో వర్కౌట్ అవుతోంది. రొటీన్ కి భిన్నంగా ఈ మాస్ ఎంటర్టైనర్ ని దర్శకుడు ఎలా డీల్ చేస్తాడన్నదే అసలు విషయం. దాని మీదనే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇక త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసుకోబోతున్నరట. మరి ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లను రాబడుతుందో వేచి చూడాలి.