క్లిక్‌ క్లిక్‌ : మెహర్‌ రమేష్ ఇంట పెళ్లికి టాలీవుడ్‌ స్టార్స్‌

దర్శకుడు మెహర్‌ రమేష్ కుమార్తె మోహన వివాహం సందర్భంగా మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు మాత్రమే కాకుండా టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌, దర్శక నిర్మాతలు హాజరు అయ్యారు.

Update: 2026-07-02 07:30 GMT

టాలీవుడ్‌లో చాలా రోజుల తర్వాత స్టార్స్‌ అంతా ఒక్క చోట కనిపించారు. దర్శకుడు మెహర్‌ రమేష్ కుమార్తె మోహన వివాహం సందర్భంగా మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు మాత్రమే కాకుండా టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌, దర్శక నిర్మాతలు హాజరు అయ్యారు. మోహన, అనిరుధ్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మెహర్‌ రమేష్‌ కూతురు వివాహంకు సంబంధించిన వార్తలు ముందుగా మీడియాలో రాలేదు. పెళ్లికి హాజరు అయిన సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలతో సోషల్‌ మీడియా హోరెత్తి పోతుంది. సినిమాల పరంగా చూస్తే మెహర్‌ రమేష్ సక్సెస్‌ రేటు చాలా తక్కువ, ఆయన హిట్‌ కొట్టి చాలా ఏళ్లు అయింది. అయినా కూడా ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న పరిచయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఇప్పటికీ చాలా సినిమాలకు వెనుక ఉండి నిర్మాణ వ్యవహారాలను పర్యావేక్షిస్తూ ఉంటాడని అంటారు.



 


మెగాస్టార్‌ చిరంజీవి సతీసమేతంగా...

మెహర్‌ రమేష్‌ కు మెగా ఫ్యామిలీతో బంధుత్వం ఉందని అంటారు. ఆ బంధుత్వం కారణంగా మెగా ఫ్యామిలీకి చెందిన చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌లు కుటుంబ సమేతంగా మోహన, అనిరుధ్‌ల వివాహంకు హాజరు అయ్యారు. సతీ సమేతంగా చిరంజీవి ఈ వివాహానికి హాజరు అయ్యి కొంత సమయం ఉండి మరీ వధూవరులను ఆశీర్వదించినట్లుగా తెలుస్తోంది. వైట్‌ అండ్‌ వైట్‌లో చిరంజీవి ఈ వివాహంకు హాజరు కావడం ప్రత్యేక విషయంగా చెప్పుకోవాలి. ఇక చిరంజీవి లుక్ సైతం అందరి దృష్టిని ఆకర్షించింది. మెగాస్టార్‌ చిరంజీవిని ఇలా వైట్‌ అండ్‌ వైట్‌లో చూడటం కాస్త కొత్తగా ఉందని కొందరు కామెంట్‌ చేస్తూ ఉంటే, మరికొందరు ఏదైనా ప్రత్యేకత ఉందా అని ఆరా తీస్తున్నారు. మొత్తానికి ఈ పెళ్లిలో చిరంజీవి సందడి కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.



 


పవన్‌ కళ్యాణ్‌ ముఖ్య అతిథిగా...

ఇక ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ మాల లో ఉన్నాడు. పైగా ఆయన చేతి గాయం కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవలే ముంబై వెళ్లి ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. అక్కడ పవన్‌ కళ్యాణ్‌ కి కచ్చితంగా ఆపరేషన్‌ అవసరం అని సూచించారు. ముందు కేటాయించిన కార్యక్రమాలు అన్నింటిని ముగించుకుని ఆపరేషన్‌కి వస్తానంటూ పవన్‌ కళ్యాణ్‌ అక్కడ నుంచి వచ్చాడు. తాజాగా మెహర్‌ రమేష్ కూతురు వివాహ వేడుకలో సతీ సమేతంగా పవన్‌ కళ్యాణ్‌ కనిపించారు. పెళ్లిలో నవ్వులు చిందిస్తూ, నూతన వధూవరులను ఆశీర్వదించిన ఫోటోలు వీడియోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో పవన్‌ కళ్యాణ్ ఎక్కడకి వెళ్లినా కూడా సతీ సమేతంగా కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిండుగా పవన్‌ కనిపిస్తున్నాడని, భార్యతో ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడూ పవన్‌ హాజరు కావాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.



 


మెహర్‌ రమేష్‌ కూతురు వివాహంలో స్టార్స్‌...

ఇంకా ఈ వివాహంలో స్టార్‌ హీరో వెంకటేష్‌ పాల్గొన్నారు. మెహర్‌ రమేష్ దర్శకత్వంలో గతంలో వెంకటేష్ నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. అందుకే పెళ్లి వేడుకలో వెంకటేష్ పాల్గొన్నారు. ఇంకా నూతన దంపతులను ఆశీర్వదించిన వారిలో.. కొరటాల శివ, ప్రభుదేవా, అల్లు అరవింద్‌, సుమ, అంబటి రాంబాబు, శ్రీనువైట్ల, బండ్ల గణేష్‌ తదితరులు ఉన్నారు. దర్శకుడిగా ప్రస్తుతం మెహర్‌ రమేష్ కొత్తగా సినిమాలు ఏమీ చేయడం లేదు. అయితే కొన్ని మెగా ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ప్రొడక్షన్‌ వ్యవహారాలను చూసుకుంటున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. మెహర్‌ రమేష్ ప్రస్తుతానికి దర్శకత్వం విషయంలో ప్రయత్నాలు చేయడం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. త్వరలో కొత్త ప్రాజెక్ట్‌ ఏమైనా మొదలు పెట్టేనా చూడాలి.

Tags:    

Similar News