జిమ్‌లోను ఆలియాకు శార్వ‌రి బ‌స్తీ మే స‌వాల్

బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ శార్వరి వాఘ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.

Update: 2026-07-02 05:31 GMT

బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ శార్వరి వాఘ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఇటీవ‌లే `మై వాప‌స్ ఆవుంగా` (ఇంతియాజ్ అలీ ద‌ర్శ‌కుడు) చిత్రంతో సైలెంట్ హిట్ కొట్టింది ఈ బ్యూటీ. ఇంత‌లోనే తాను నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ `ఆల్ఫా` విడుదలకు కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన మిడ్‌వీక్ మోటివేషన్ ఫోటోలు నెట్టింట మంటలు పుట్టిస్తున్నాయి. ``పర్ఫెక్ట్ ఫిట్‌నెస్ బ్యూటీ!`` అంటూ ఈ లుక్ ఫ్యాన్స్ నుంచి ప్ర‌శంస‌లు అందుకుంటోంది. సిసలైన `ఆల్ఫా` ఎనర్జీతో ఉన్న శార్వరి గ్లామరస్ జిమ్మింగ్ లుక్స్‌ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సినిమా రిలీజ్ ముందే బిగ్ స్క్రీన్ ట్రీట్ కోసం జిమ్‌లో కష్టపడుతున్నాను! అంటూ ఈ ఫోటోకి వ్యాఖ్య‌ను జోడించింది శార్వ‌రి. ఈ పోస్ట్ కి ఫైర్, హార్ట్ ఎమోజీలు షేర్ చేసి కామెంట్లతో ఫ్యాన్స్ ర‌చ్చ చేస్తుంటే, ఆల్ఫాపై అంచనాలు మ‌రింత పెరుగుతున్నాయి.

 

ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలీవుడ్ టాప్ స్టార్ ఆలియా భట్‌తో కలిసి శార్వరి స్క్రీన్ షేర్ చేసుకుంది. పెద్ద తెర‌పై నువ్వా నేనా? అంటూ ఇద్ద‌రు లేడీ స్పైలు పోటీప‌డుతూ న‌టించార‌ని ట్రైల‌ర్ రివీల్ చేసింది. ట్రైల‌ర్ త‌ర్వాత ఈ మూవీపై ఫ్యాన్స్ కి కొంత కిక్కు ఎక్కింది. కేవలం వెండితెరపైనే కాదు.., జిమ్‌లో వర్కవుట్స్ చేయడంలోనూ ఆలియాతో పోటీపడుతూ శార్వరి స్పీడ్ పెంచింద‌ని ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతోంది. సీనియర్ నటి అయిన ఆలియా భట్ నుండి ఎన్నో మెళకువలు నేర్చుకుంటూ శార్వరి తన పాత్రను అద్భుతంగా పండించిందట. వైఆర్ఎఫ్ (YRF) స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్‌లో ఇద్దరు భామలు పోటాపోటీగా చేసిన స్టంట్స్ సినిమాకే హైలైట్ కాబోతున్నాయని తెలుస్తోంది.

 

ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రెమ్యునరేషన్ పరంగా ఆలియా భట్ కంటే శార్వరి ఏకంగా 8 రెట్లు తక్కువ పారితోషికం అందుకుందిట‌. అయినా నటనలో గానీ, రిస్కీ యాక్షన్ సీక్వెన్స్‌లలో గానీ ఎక్కడా రాజీ పడకుండా ప్రాణం పెట్టి నటించిందట. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా `షార్వరి స్క్రీన్ ప్రెజెన్స్ టెర్రిఫిక్` అంటూ.. కొందరైతే ఏకంగా ఆలియా కంటే శార్వరే బెస్ట్ అంటూ కామెంట్లు పెడుతుండటం విశేషం. ఈ క్రేజీ కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు.

 

యష్ రాజ్ ఫిలిమ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన `ఆల్ఫా` చిత్రాన్ని కేవలం హిందీలోనే కాకుండా, సౌత్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ అత్యంత భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. బాలీవుడ్‌లో ఇప్పటికే లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండగా.. మరి ఇద్దరు అందమైన గాళ్స్ యాక్షన్ ట్రీట్‌కు మన సౌత్ ఆడియన్స్ ఎంతవరకు ఫిదా అవుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇద్దరు లేడీ స్పైలతో యాక్షన్ అడ్వెంచర్‌కు మన ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారో లేదో చూడాలి.





 


ఏ సినిమాకైనా మొదటి మూడు రోజులు అత్యంత కీలకం. `ఆల్ఫా` సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే జోరందుకోగా.. ఈ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద ఈ భామలు ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో తేలిపోనుంది. సినిమాకు వచ్చే రివ్యూలు, పబ్లిక్ టాక్, అలాగే తొలి మూడు రోజుల కలెక్షన్ల ఆధారంగా ఈ స్పై థ్రిల్లర్‌లో అసలు మేటర్ ఎంత ఉందనేది స్పష్టమవుతుంది. సోషల్ మీడియాలో `సీ యూ ఆన్ ది బిగ్ స్క్రీన్ మై ఆల్ఫా` అంటూ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా చూస్తుంటే శార్వరి కెరీర్‌లోనే ఇది ఒక మైలురాయిగా నిలిచేలా కనిపిస్తోంది.

Tags:    

Similar News