చెడులోను మంచి.. బోల్డ్ బ్యూటీ రికార్డ్

ఈ ప్రతికూలత సౌందర్యకు కొంత సానుకూలంగా మారింది. తాజా క‌థ‌నాల ప్రకారం.. సౌందర్య వికీలో అత్యధికంగా శోధించబ‌డిన నటిగా మారింది.;

Update: 2025-06-12 03:00 GMT

బాలీవుడ్ యంగ్ బ్యూటీ సౌంద‌ర్య శ‌ర్మ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఈ భామ ప‌లు బోల్డ్ వెబ్ సిరీస్ ల‌తో యువ‌త‌రం హృద‌యాల్లో తిష్ఠ వేసింది. గ్లామ‌రస్ పాత్ర‌ల‌తో మ‌త్తెక్కించ‌డంలో సౌంద‌ర్య శ‌ర్మ ప్ర‌త్యేక‌త గురించి చాలా చ‌ర్చ సాగుతోంది. ఇంత‌లోనే ఈ బ్యూటీ `హౌస్ ఫుల్ 5`లో క‌నిపించింది. ఈ సినిమాలో ముగ్గురు అందాల భామ‌లు న‌టించ‌గా, అంద‌రిలో సౌంద‌ర్యనే ఎక్కువ మార్కులు కొట్టేసింది.

థియేట‌ర్ కి వెళ్లిన ప్ర‌తి ఒక్క యువ‌కుడు ఈ బ్యూటీ గురించే ముచ్చ‌టించుకున్నారు. సౌంద‌ర్య ఎక్స్ పోజింగ్ -హావ‌భావాలు మ‌త్తెక్కించాయ‌న్న చ‌ర్చా సాగింది. అయితే హ‌ద్దు మీరి ఎక్స్ పోజింగ్ చేసింద‌ని.. వ‌ల్గ‌ర్ దృశ్యాల్లో జీవించింద‌ని కూడా సౌంద‌ర్య‌పై విమ‌ర్శ‌లొచ్చాయి. అయితే చెడు ప్ర‌చారంతో కూడా ఈ అమ్మ‌డికి మంచే జ‌రిగింది.

ఈ ప్రతికూలత సౌందర్యకు కొంత సానుకూలంగా మారింది. తాజా క‌థ‌నాల ప్రకారం.. సౌందర్య వికీలో అత్యధికంగా శోధించబ‌డిన నటిగా మారింది. నిజానికి ఈ పోటీలో అక్షయ్ కుమార్‌ను కూడా వెన‌క్కి నెట్టింది.

త‌న‌తో పాటు న‌టించిన జాక్విలిన్, న‌ర్గీస్ ఫ‌క్రీ, సోన‌మ్ బ‌జ్వా వంటి స్టార్ల‌ను కూడా సౌంద‌ర్య అధిగ‌మించ‌డం ఆస‌క్తిక‌రం. సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ల‌ను మించి సౌంద‌ర్య శ‌ర్మకు మంచో చెడో గుర్తింపు అయితే ద‌క్కింది. కొన్నిసార్లు నెగెటివిటీ కూడా కెరీర్ ఎదుగుదల‌కు దారి తీయొచ్చు. సౌంద‌ర్య‌కు బాలీవుడ్ లో అవ‌కాశాల ప‌రంగా కొద‌వేమీ లేదు. వ‌రుస‌గా వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తోంది. గ్రాండ్ మ‌స్తీ రేంజులో చెల‌రేగిపోవ‌డ‌మే నేటి యూత్ కి అవ‌స‌రం. సౌంద‌ర్య శ‌ర్మ ఫాలో చేసింది అదే.

ఇప్పుడు ఈ గ్లామ‌ర్ షో త‌న ఫాలోయింగ్ ని మ‌రింత పెంచిందే కానీ త‌గ్గించ‌లేదు. హౌస్ ఫుల్ 5 చిత్రంలో హ‌ద్దు మీరిన ఎక్స్ పోజింగులు, వ‌ల్గారిటీ విష‌యంలో విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంటున్నా కానీ, ప్ర‌తిదీ సౌంద‌ర్య శ‌ర్మ‌కు క‌లిసొస్తోంది. బాలీవుడ్ లో హ‌ద్దు మీరిన గ్లామ‌ర్ ట్రీట్ పై కొంద‌రు వెట‌ర‌న్ న‌టులు, సీనియ‌ర్ తార‌లు తీవ్రంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నా, అందాల భామ‌ల్ని ఆరాధించే ప్ర‌జలు పెరుగుతున్నార‌ని నిరూప‌ణ అవుతోంది.

Tags:    

Similar News