కసబ్‌ను ఉంచిన సెల్లోనే నన్ను ఉంచారు: నటుడు పాంచోళి
జైలులో తనకు దిండు కూడా ఇవ్వలేదని, తన కేసు గురించి ముఖ్యాంశాలు ప్రచురించిన వార్తాపత్రికలకు తాను బాగానే నిద్రపోయానని చెప్పారని అన్నారు.;
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఆదిత్య పాంచోళి కుమారుడు సూరజ్ పాంచోళి నటి జియా ఖాన్ ను హత్య చేసాడని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కానీ జియా ఆత్మహత్య చేసుకుందని సూరజ్ కోర్టులో వాదించాడు. ఈ కేసు కొన్ని సంవత్సరాల పాటు తీర్పు కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. ఇంతకుముందే సూరజ్ ఈ కేసులో నిర్ధోషి గా బయటకు వచ్చాడు.
దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత కేసరి వీర్ అనే సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సందర్భంగా 'కేసరి వీర్' ట్రైలర్ లాంచ్‌లో సూరజ్ పంచోలి భావోద్వేగానికి లోనవుతున్నాడు. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పిన అతడు జియా ఖాన్ కేసులో తాను జైలు పాలైన సమయాన్ని గుర్తుచేసుకున్నాడు. తనను ముంబైలోని ఉగ్రవాది అజ్మల్ కసబ్ జైలు గదిలో ఉంచారని వెల్లడించాడు. తాను జైలులో ఉన్న మొత్తం ఎపిసోడ్ తనకు మరకగా మారిందని, ఆ సమయంలో తనకు కేవలం 21 ఏళ్లు మాత్రమేనని, ఎలా స్పందించాలో తెలియని వయసు అదని చెప్పాడు. నన్ను ఆర్థర్ రోడ్ జైలుకు పంపించి, అండా సెల్ (ఏకాంత నిర్బంధం)లో ఉంచారు. నన్ను విడిగా, ఒంటరిగా ఉంచారు. వారు కసబ్‌ను ఉంచిన సెల్‌లోనే నేను ఉన్నాను. వారు నన్ను బాంబు పేల్చిన ఉగ్రవాదిలా చూసారు! అని తెలిపారు.
జైలులో తనకు దిండు కూడా ఇవ్వలేదని, తన కేసు గురించి ముఖ్యాంశాలు ప్రచురించిన వార్తాపత్రికలకు తాను బాగానే నిద్రపోయానని చెప్పారని అన్నారు. జైలు అధికారులు నాతో భయంకరంగా ప్రవర్తించారు. నేను ఏదో భయంకరమైన నేరం చేసినట్లు.. నేను అతిశయోక్తి గా చెప్పడం లేదు. నేను ఏమి అనుభవించానో నాకు సరిగ్గా అర్థమైంది ఎప్పుడు అంటే.. నాలుగైదేళ్లకు కానీ అర్థం కాలేదు. ఇదంతా జరుగుతున్నప్పుడు ఒక కలలా అనిపించింది అని అతడు చెప్పాడు. కోర్టు తనకు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం చాలా మందికి ఇంకా తెలియదని సూరజ్ అన్నారు. తెలిసిన వారిలో చాలా మంది సెలబ్రిటీలు, సామాన్యులు తనను సంప్రదించి నా గురించి ఇతరులు తప్పుగా చెప్పారని అన్నారు.
జియా ఖాన్ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని మరణించిన 10 సంవత్సరాల తర్వాత, ఏప్రిల్ 2023లో సీబీఐ ప్రత్యేక కోర్టు సూరజ్ దోషి అని నిరూపించడానికి సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ నిర్దోషిగా ప్రకటించింది. ప్రస్తుతం సూరజ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. నటుడిగా నిరూపించుకునేందుకు అతడు సిద్ధమయ్యాడు.