ఫోటోటాక్‌ : కపూర్‌ బ్యూటీ మళ్లీ సర్‌ప్రైజ్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనమ్ కపూర్‌ మరోసారి అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. 2018లో వ్యాపారవేత్త ఆనంద్‌ ఆహుజాను వివాహం చేసుకున్న సోనమ్‌ కపూర్‌ 2022లో మొదటి సారి తల్లి అయింది.;

Update: 2025-11-20 23:30 GMT

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనమ్ కపూర్‌ మరోసారి అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. 2018లో వ్యాపారవేత్త ఆనంద్‌ ఆహుజాను వివాహం చేసుకున్న సోనమ్‌ కపూర్‌ 2022లో మొదటి సారి తల్లి అయింది. ఆ సమయంలోనూ తాను తల్లి కాబోతున్నాను అంటూ సర్‌ప్రైజింగ్‌ ఫోటోలు షేర్‌ చేసింది. బేబీ బంప్‌తో సోనమ్‌ కపూర్‌ షేర్ చేసిన ఫోటోలు ఆ సమయంలో చర్చనీయాంశం అయ్యాయి. స్టార్‌ హీరోయిన్‌ తల్లి కాబోతుంది అంటూ తెగ ప్రచారం జరిగింది. మొదటి సారి బాబుకు జన్మనిచ్చిన సోనమ్ కపూర్‌ దంపతులు అతడికి వాయు అని పేరు పెట్టారు. వాయు ఇప్పుడు మూడు ఏళ్ల వయసు పిల్లాడు. ఇంతలోనే అతడు అన్న కాబోతున్నాడు అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది. వాయు అన్న కాబోతున్నట్లుగా అధికారికంగా సోనమ్‌ కపూర్‌ ఫోటోలు షేర్ చేసి మరీ ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.




బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రెగ్నెంట్‌...

సోనమ్‌ కపూర్‌ పింక్‌ కలర్‌ డ్రెస్‌లో బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగానే సెలబ్రిటీల యొక్క ప్రగ్నెన్సీ వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటాయి. కానీ సోనమ్‌ కపూర్‌ యొక్క సెకండ్‌ ప్రెగ్నెన్సీ పెద్దగా చర్చ జరగలేదు. సోషల్‌ మీడియాలోనూ ఆమె ప్రెగ్నెన్సీ గురించి ప్రచారం జరగలేదు. దాంతో అసలు విషయం ఏంటో అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు సోనమ్‌ కపూర్‌ నుంచి క్లారిటీ వచ్చింది. ఆమె బేబీ బంప్‌ తో ఫోటో షూట్‌ ఇచ్చింది. దాంతో ఒక్కసారిగా అంతా సర్‌ప్రైజ్ అయ్యారు. సాధారణంగా అయితే సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగి ఆ తర్వాత విషయాన్ని కన్ఫర్మ్‌ చేస్తారు. కానీ సోనమ్‌ కపూర్‌ సెకండ్‌ ప్రెగ్నెన్సీ విషయం గురించి వార్తలు రాకపోవడంతో ఇప్పుడు అంతా సర్‌ప్రైజ్‌ అవుతున్నారు అనేది సోషల్‌ మీడియా కామెంట్స్‌ను చూస్తే అర్థం అవుతుంది.

సోనమ్‌ కపూర్‌ హీరోయిన్‌గా

హీరోయిన్‌గా సోనమ్‌ కపూర్‌ సినిమాలు గతంతో పోల్చితే తగ్గించింది. 2019 సంవత్సరం వరకు వరుస సినిమాలు చేసిన సోనమ్‌ కపూర్‌ పెళ్లి తర్వాత తగ్గించింది అనేది అభిమానుల కంప్లైంట్‌. హీరోయిన్‌గా సోనమ్‌ కపూర్‌ వరుస సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ఆమె నుంచి మాత్రం సినిమాలు అంతగా రావడం లేదు. 2023 లో బ్లైండ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. అయినా కూడా నటిగా మంచి మార్కులు తెచ్చి పెట్టింది. ఆ వెంటనే ఒకటి రెండు సినిమా ఆఫర్లు వచ్చాయట. కానీ ఆమె మాత్రం సున్నితంగా తిరస్కరించిందని సమాచారం. రెండో ప్రెగ్నెన్సీ కారణంగా సోనమ్‌ కపూర్ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. త్వరలోనే ఆమె రెండో బేబీకి జన్మనిచ్చిన తర్వాత సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

అనిల్‌ కపూర్ కుమార్తె సోనమ్‌ కపూర్‌

బాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ హీరో అనిల్‌ కపూర్ కుమార్తె అయిన సోనమ్‌ కపూర్‌ మొదట్లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేసింది. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన సావరియా సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 2007 సంవత్సరంలో ఆ సినిమా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో సోనమ్‌ కపూర్‌ వెనక్కి తిరిగి చూసుకోనవసరం రాలేదు. బాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్‌ హీరోలకు జోడీగా నటించడం ద్వారా స్టార్‌ హీరోయిన్‌గా నిలిచింది. ఎన్నో అవార్డులు, రికార్డ్‌లను సొంతం చేసుకున్న హీరోయిన్‌గానూ సోనమ్‌ కపూర్ నిలిచింది. ఆకట్టుకునే అందంతో పాటు, నటిగానూ సోనమ్‌ కపూర్ తన సినిమాలతో మెప్పించడం జరుగుతుంది. అందుకే ఈమె సినిమాలను అభిమానించే వారు చాలా మంది ఉంటారు. సెకండ్‌ ప్రెగ్నెన్సీ తర్వాత సోనమ్‌ మళ్లీ బిజీ కావాలని అంతా కోరుకుంటున్నారు. మరి ఆమె ఉద్దేశం ఏంటో చూడాలి.

Tags:    

Similar News