• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గంగ అంటే భ‌యం నావ‌ల్ల...

గంగ అంటే భ‌యం నావ‌ల్ల కాద‌నేసింది!

| ఈ సంద‌ర్భంగా అందులో హీరోయిన్ గా న‌టించిన సోనాలి బింద్రే గురించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యం పంచుకున్నారు.

By - Tupaki Desk
Update: 2024-08-25 03:15 GMT

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని ఆయ‌న హీరోగా న‌టించిన 'ఇంద్ర' చిత్రాన్ని మ‌ళ్లీ రీ-రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో ఈ సినిమా రికార్డు వ‌సూళ్ల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద కొత్త చ‌రిత్ర రాసింది. సీమ బ్యాక్ డ్రాప్ సినిమాల‌కు కొత్త అర్దాన్నితీసుకొచ్చిన చిత్రంగా నిలిచింది. తాజాగా ఆ సినిమా అనుభూతుల్ని దర్శ‌కుడు బి.గోపాల్ పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా అందులో హీరోయిన్ గా న‌టించిన సోనాలి బింద్రే గురించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యం పంచుకున్నారు. అదేంటో ఆయ‌న మాట‌ల్లోనే...

`సోనాలి బెంద్రే .. ఆర్తి అగర్వాల్ ఇద్దరూ కూడా మంచి అందగత్తెలు. ఆ పాత్రలకు వాళ్లు సరిగ్గా సరిపోయారు. సినిమాలో సోనాలి గవర్నర్ కూతురుగా నటించింది. కాశీకి సంబంధించిన షెడ్యూల్లో ఆమె మొదటిసారిగా షూటింగులో పాల్గొన్నారు. ఆమె గంగలో మునకేసి లేవగానే, ఆమె మెడలోని పూలమాల చిరంజీవి మెడలోకి చేరుతుంది. అది సీన్.

ఈ సీన్ గురించి చెప్పగానే సోనాలి కంగారు పడిపోయింది. సార్ నాకు నీళ్లంటే చాలా భయం . మునిగితే చచ్చిపోతాను . నా వల్ల కాదు సార్` అని చెప్పింది. `అయ్యో ఆ సీన్ చాలా ఇంపార్టెంట్ .. హీరోతో ముడిపడిన సీన్ .. తప్పకుండా చెయ్యాలి .. నీ ప్రాణానానికి నా ప్రాణం అడ్డు. నీ చుట్టూ మనుషులను పెడతాను. భయపడ వలసిన పనిలేదు. ఒక్కసారి మునిగి పైకి లే చాలు` అన్నాను.

మొత్తానికి భ‌య‌ప‌డుతూనే ఆ సీన్ చేసింది. కానీ చాలా బాగా చేసింది. నేను అనుకున్న‌దానికంటే మంచి ఔట్ పుట్ ఇచ్చింది. థియేట‌ర్ లో ఆ సీన్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది` అని అన్నారు.

Tags:    
  • Tollywood 
  • Indra 
  • Rerelease 
  • Chiranjeevi 
  • Sonalibendra 
  • Sema 
  • BGopi 
  • ArtiAgarwal 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS