• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #ఎస్ ఎస్ ఎంబీ 29 లో...

#ఎస్ ఎస్ ఎంబీ 29 లో సోనాల్ చౌహాన్!

| ఈ నేప‌థ్యంలో ఇదే ప్రాజెక్ట్ లో సోనాల్ చౌహాన్ కూడా ఛాన్స్ అందుకుంద‌ని మీడియా క‌థ‌నాలు వెడెక్కిస్తున్నాయి.

By - Tupaki Desk
Update: 2023-08-31 12:16 GMT

బాల‌య్య బ్యూటీ గా సోనాల్ చౌహాన్ టాలీవుడ్ లో బాగా ఫేమ‌స్. 'లెజెండ్'..'డిక్టేట‌ర్'..'రూల‌ర్' లాంటి సినిమాల్లో న‌టించ‌డంతోనే ఈ ర‌క‌మైన గుర్తింపు ద‌క్కింది. ఇవి గాకుండా మ‌రికొన్ని సినిమాలు చేసింది కానీ..బాల‌య్య స‌ర‌స‌న న‌టిస్తే వ‌చ్చినంత గుర్తింపు ఇంకే హీరో ఇవ్వ‌లేక‌పోయాడు. అలాగ‌ని అమ్మ‌డి కెరీర్ లో భారి విజ‌యాలు ఏవైనా ఉన్నాయా? అదీ లేదు. 'లెజెండ్'..'ఎఫ్ -3' త‌ప్పా మిగ‌తావ‌న్ని బాక్సాఫీస్ వ‌ద్ద తుస్సుమ‌న్నవే.

అయినా స‌రే పాన్ ఇండియా చిత్రం 'ఆదిపురుష్' లో మండోద‌రి పాత్ర‌లో న‌టించే అవ‌కాశం ఒడిసిప ట్టుకుంది. అందులోనూ న‌టించింది. కానీ ఆ సినిమా కూబా బాక్సాఫీస్ వ‌ద్ద బొల్తా కొట్టింది. ఇలా ఏ ద‌శ‌లో చూసుకున్నా సోనాల్ చౌహాన్ కి విజ‌యం కాన రావ‌డం లేదు. తాజాగా ఈ బ్యూటీ మ‌రోసారి ఓ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లోనూ అవ‌కాశం అందుకుందున్న వార్త కుదిపేస్తోంది. ఆ సినిమా గురించి తెలిస్తే ఈ ఛాన్స్ నిజంగా ఆమెకే వ‌చ్చిందా? అని ఆశ్చ‌ర్యపోవ‌డం ఖాయం. వివ‌రాల్లోకి వెళ్తే.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా రాజ‌మౌళి ఓ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా లో బాలీవుడ్ స‌హా హాలీవుడ్ న‌టులు..ఇత‌ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టులు ఉంటార‌ని వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇదే ప్రాజెక్ట్ లో సోనాల్ చౌహాన్ కూడా ఛాన్స్ అందుకుంద‌ని మీడియా క‌థ‌నాలు వెడెక్కిస్తున్నాయి. అమ్మ‌డిని ఓ కీల‌క మైన పాత్ర‌కి ఎంపిక చేసిన‌ట్లు వార్తలొస్తున్నాయి.

మండోద‌రి పాత్ర‌ని మెచ్చి ఈ అవ‌కాశం వ‌చ్చిన‌ట్లు గా వినిపిస్తుంది. ఇటీవ‌ల అమ్మ‌డు హైద‌రాబాద్ లో నే ఉందిట‌. రాజ‌మౌళి అండ్ కోతో అసోసియేట్ అవుతున్న‌ట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలో ఈ విష‌యం లీకైంది. మ‌రి ఇందులో వాస్త‌వం ఏంటో తెలియాలి.ఇది నిజ‌మైతే గ‌నుక సోనాల్ కెరీర్ కొత్త ట‌ర్నింగ్ తీసుకున్న‌ట్లే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్టింగ్ దశలో ఉంది. ఈ సంవత్సరం చివరి నాటికి అధికారికంగా చాలా స‌మాచారం తెలిసే ఛాన్స్ ఉంది.

Tags:    
  • Tollywood 
  • Maheshbabu 
  • Rajamouli 
  • Ssmb29 
  • Movie 
  • Sonalchauhan 
  • Actress 
  • Actresssonal 
  • Panindia 

Similar News

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

2026-11-12 18:00 GMT

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...

2026-11-12 17:30 GMT

ఒకప్పుడు ప్రభాస్ ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉందన్నాడు. ఇప్పుడు చేస్తాడా?

2026-11-12 16:30 GMT

ఈ హీరో పైన అంత నమ్మకం ఏంటి..!

2026-11-12 16:15 GMT

2027లో బ్లాస్టింగ్ మామూలుగా ఉండ‌దు!

2026-11-12 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS