• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హీరో కన్నీళ్లు.. టికెట్లు...

హీరో కన్నీళ్లు.. టికెట్లు తెంచుతాయా?

| ఇప్పుడు సోహెల్ హీరోగా 'బూట్ కట్ బాలరాజు' అనే సినిమా రాబోతోంది. ఫిబ్రవరి 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో సోహెల్ ప్రసంగం అందరినీ కదిలించింది.

By - Tupaki Desk
Update: 2024-01-31 18:27 GMT

జనాల మీద సెంటిమెంట్ అస్త్రాలు బాగానే పని చేస్తుంటాయి కొన్ని సార్లు. కొన్ని నెలల కిందట తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కౌశిక్ రెడ్డి తన భార్య, కూతురితో కలిసి జనాలకు దండం పెడుతూ తనను ఈసారి ఎన్నికల్లో గెలిపించకపోతే ఆత్మహత్యే శరణ్యం అంటూ దీనంగా వేడుకున్నారు. ఇది ఎన్నికల్లో బాగానే పని చేసింది. రాజకీయ నాయకులతో సినిమా వాళ్లకు పోలిక లేదు కానీ.. ఇప్పుడు ఒక హీరో కన్నీళ్లు పెట్టుకుని తన దీన స్థితిని తెలియజేయడం, తన సినిమా చూడాలని ప్రేక్షకులను కోరడం చర్చనీయాంశంగా మారింది. ఆ హీరోనే.. సోహెల్. బిగ్ బాస్ షోతో పాపులారిటీ సంపాదించిన సోహెల్ ఆల్రెడీ 'మిస్టర్ ప్రెగ్నెంట్' అనే వెరైటీ సినిమా చేశాడు. అందులో ఓ సాహసోపేత పాత్ర చేశాడు. కానీ సరైన ఫలితం రాలేదు.

ఇప్పుడు సోహెల్ హీరోగా 'బూట్ కట్ బాలరాజు' అనే సినిమా రాబోతోంది. ఫిబ్రవరి 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో సోహెల్ ప్రసంగం అందరినీ కదిలించింది. నిర్మాత పాషాకు సినిమా సగంలో ఉండగా ఆర్థిక సమస్యలు రావడంతో సినిమా ఆగిపోయే పరిస్థితి వచ్చిందని.. ఆ స్థితిలో ఇల్లు కొనుక్కుందామని తాను దాచుకున్న డబ్బు, తన తండ్రి పెన్షన్ సొమ్ము కలిపి సినిమా మీద ఖర్చు చేశానని.. తన దగ్గర పబ్లిసిటీ చేయడానికి కూడా డబ్బులు లేవని కన్నీళ్లు పెట్టుకున్నాడు. మోకాళ్ల మీద కూర్చుని దయచేసి తన సినిమా చూడాలని ప్రేక్షకులను కోరాడు. బిగ్ బాస్ షోతో తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు సోహెల్. వాళ్లు కొంతమేర 'మిస్టర్ ప్రెగ్నెంట్' రిలీజ్ టైంలో సపోర్ట్ చేశారు. ఐతే బిగ్ బాస్ షోతో వచ్చిన ఫేమ్‌ను ఉపయోగించుకుని సినిమాల్లో సక్సెస్ అయిన వాళ్లు తక్కువే. నెమ్మదిగా వాళ్ల పాపులారిటీ కరిగిపోతుంటుంది. మరి సోహెల్ ఈ ట్రెండును బ్రేక్ చేసి 'బూట్ కట్ బాలరాజు'తో జనాలకు చేరువ అవుతాడేమో.. అతడి కన్నీళ్లు సినిమాకు టికెట్లు తెంచుతాయేమో చూడాలి.


Tags:    
  • Tollywood 
  • Biggboss 
  • Sohel 
  • Syedsohelryan 
  • Bootcutbalraju 
  • Bootcutbalrajumovie 
  • Emotional 
  • Prerelease 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS