లైవ్‌లోనే లెహంగా డ్రాప్.. శోభిత స్టైల్‌కు ఆడియన్స్ ఫిదా!

ఇండియా కౌచర్ వీక్ 2026 వేడుకల్లో నటి శోభిత ధూళిపాళ తన గ్లామర్‌తో అందరి దృష్టినీ ఆకట్టుకుంది.

Update: 2026-07-30 06:26 GMT

ఇండియా కౌచర్ వీక్ 2026 వేడుకల్లో నటి శోభిత ధూళిపాళ తన గ్లామర్‌తో అందరి దృష్టినీ ఆకట్టుకుంది. ప్రముఖ డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన 'దేవి' కలెక్షన్‌కు ఆమె షోస్టాపర్‌గా వ్యవహరించింది. సాధారణంగా ర్యాంప్‌పై నడవడమే చూస్తుంటాం, కానీ ఇక్కడ అందరూ చూస్తుండగానే లైవ్‌లోనే శోభితకు లెహంగా డ్రాపింగ్ చేయడం విశేషం. ఈ అద్భుతమైన ప్రదర్శన, ఆమె అభినయం చూసి ఆడియన్స్ ఒక్కసారిగా ఫిదా అయిపోయారు. ఆ విశేషాలు చూద్దాం..

రాహుల్ మిశ్రా మ్యాజిక్: 'దేవి' కలెక్షన్:

ఇటీవలే ప్యారిస్ హాట్ కౌచర్ వీక్‌లో ప్రదర్శించి ప్రశంసలు అందుకున్న 'దేవి' కలెక్షన్‌ను, రాహుల్ మిశ్రా ఈసారి భారతీయ సంస్కృతికి తగినట్లుగా ఢిల్లీ ర్యాంప్‌పైకి తీసుకొచ్చారు.ఇక స్త్రీత్వంలోని దైవత్వాన్ని ఆవిష్కరిస్తూ రూపుదిద్దిన ఈ దుస్తులు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. సంప్రదాయ కలలకు ఆధునిక టచ్ ఇస్తూ డిజైన్ చేసిన ఈ అవుట్‌ఫిట్స్ ఫ్యాషన్ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి.

దేవతలా మెరిసిపోయిన శోభిత:

ఈ షోలో శోభిత మొదట ఐవరీ, షాంపైన్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న కౌచర్ డ్రెస్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఇక సన్నని క్రిస్టల్ బీడ్స్ వర్క్‌తో తయారుచేసిన ఆ డ్రెస్ చూస్తే.. మెడలో అందమైన నగలే వేసుకున్నారా అన్నట్లుగా ఉంది. శోభిత రాచరికపు వెలుగుతో ర్యాంప్‌పై నడుస్తుంటే ప్రేక్షకులు కనురెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయారు.

ర్యాంప్‌పైనే సర్ ప్రైజ్ చేసేశారు:

ఆమె మొదటి వాక్ పూర్తయ్యాక అసలైన మ్యాజిక్ జరిగింది. ఇక శోభిత ర్యాంప్‌పై ఉండగానే కొందరు పర్ఫార్మర్స్ వచ్చి, ఆమె వేసుకున్న డ్రెస్‌పైనే ఎంతో గ్రాండ్‌గా ఉన్న లెహంగాను లైవ్‌లోనే తొడిగారు. అంతేకాదు, ఆ సమయంలోనే అదనపు ఆభరణాలను కూడా ఆమెకు తొడిగారు.

దేవతకు అలంకారం చేస్తున్నట్లుగా..:

పూర్వకాలంలో రాచరికంలో లేదా పూజా సమయాల్లో దేవికి అలంకరించినట్లుగా ఈ దృశ్యం అనిపించింది. ఇక కళ్ళముందే ఒక సాదాసీదా రూపం నుంచి పరిపూర్ణమైన దేవి రూపంలోకి శోభిత మారిపోవడం చూసి హాల్లో లోని వారందరూ చప్పట్లతో మార్మోగించారు. ఇక ఈ కాన్సెప్ట్ ఫ్యాషన్ షోకే ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఫ్యాషన్ షో అంటే కేవలం మోడల్స్ నడవడమే కాదని, అదొక గొప్ప కళ అని రాహుల్ మిశ్రా, శోభిత ధూళిపాళ కలిసి నిరూపించారు. ఇక సంప్రదాయ కళానైపుణ్యానికి, నాటకీయతను జోడించి చేసిన ఈ ప్రదర్శన ఇండియా కౌచర్ వీక్ 2026కే హైలైట్‌గా నిలిచిపోతుంది. శోభిత మేకప్, స్టైలింగ్, కాన్ఫిడెన్స్ ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేశాయి.

Tags:    

Similar News