గద్వాల్ చీరలో జేజమ్మను తలపించిన అక్కినేని కోడలు!

సాధారణంగా సెలబ్రిటీలు ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి భిన్న విభిన్నమైన దుస్తులను ధరిస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే .

Update: 2026-07-06 16:37 GMT

సాధారణంగా సెలబ్రిటీలు ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి భిన్న విభిన్నమైన దుస్తులను ధరిస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే . కానీ కొంతమంది సెలబ్రిటీలు మాత్రం దేశీ దుస్తులను ధరించడమే కాకుండా వాటిని ప్రమోట్ చేస్తూ అందరిని ఆకర్షిస్తున్నారు. అలాంటి వారిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అక్కినేని కోడలు అలియాస్ తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాల. ఈమె పేరుకే వైజాగ్ కి చెందిన అమ్మాయి అయినప్పటికీ ఎక్కువగా బాలీవుడ్ లోనే చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరించింది.



 


ఎప్పుడైతే నాగచైతన్య తన భార్య, ప్రముఖ హీరోయిన్ సమంతకి విడాకులు ఇచ్చారో ఆ తర్వాత శోభిత ధూళిపాల పేరు లైమ్ లైట్ లోకి రావడం గమనార్హం. ముఖ్యంగా లండన్ లోని ఒక హోటల్లో.. ఆ హోటల్ చెఫ్ నాగచైతన్య తో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అందులో శోభిత ప్రత్యక్షమై అనుమానాలకు తెరలేపింది. ఇక అప్పటినుంచి వార్తల్లో నిలిచిన ఈమె ఎట్టకేలకు నాగచైతన్య అని పెళ్లి చేసుకొని మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అంతే కాదు దేశవ్యాప్తంగా ఎక్కువ ప్రజాదారణ పొందిన నటీమణుల్లో ఒక్కరిగా నిలిచిపోయింది శోభిత.



 


ఇకపోతే తెలుగు సాంప్రదాయాలను గౌరవిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకునే ఈమె తాజాగా అరుంధతి జేజమ్మను తలపించేలా గద్వాల్ చీర కట్టుకొని మెస్మరైజ్ చేసింది. క్రీమ్ కలర్ చెక్స్ కలిగిన చీరకి బ్లూ అండ్ పర్పుల్ కలర్ తో బార్డర్ డిజైన్ చేశారు. ఇక పళ్ళు భాగంలో ఆరంజ్ కలర్ తో డిజైన్ చేయగా.. చిన్నపాటి ట్యాజిల్స్ చీరకి కొత్త అందాన్ని తీసుకొచ్చాయి. అలా గద్వాల్ చీరను కట్టుకొని నుదిటిన పెద్ద బొట్టుతో సాంప్రదాయం ఉట్టిపడేలా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇక ఈ ఫోటోలకి క్యాప్షన్ గా "ఇక్కడ అన్ని రకాల వైబ్స్ లభిస్తాయి" అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. మొత్తానికైతే స్వదేశీ దుస్తులను ధరిస్తూ స్వదేశీ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం శోభిత షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.



 


1993 మే 31న వేణుగోపాలరావు, శాంతారావు దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెనాలిలో జన్మించింది. వీరిది బ్రాహ్మణ కుటుంబం. విశాఖపట్నంలోని లిటిల్ ఏంజెల్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్లో తన చదువును పూర్తి చేసిన ఈమె.. ముంబై యూనివర్సిటీ హెచ్ ఆర్ కాలేజీలో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తి చేసింది . సాంప్రదాయ నృత్యాలైన కూచిపూడి, భరతనాట్యంలో కూడా శిక్షణ తీసుకుంది శోభిత.



 


2013లో మిస్ ఇండియా అందాల పోటీలలో రెండవ స్థానం దక్కించుకున్న ఈమె.. 2013లో జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీలలో ఇండియా తరఫున పాల్గొనింది. ఇక 2016లో తొలిసారి అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ 2.0 చిత్రం ద్వారా నటిగా వెండితెరకు పరిచయమైన ఈమె.. ఆ తర్వాత అడవి శేషు హీరోగా, మహేష్ బాబు నిర్మించిన మేజర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో మేజర్, గూఢచారి చిత్రాలలో నటించిన శోభిత మళ్లీ మరో తెలుగు చిత్రంలో నటించలేదు. ఇక హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది.

Tags:    

Similar News