డ్రాగన్ లో తారక్ అత్యంత కృరంగా!
ప్రశాంత్ నీల్ మార్క్ మేకింగ్ స్టైల్ పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌కు అదనపు బలాన్ని చేకూర్చనుంది. ఓపియం వ్యాపారం అనే అంశం చుట్టూ అల్లిన కథనం, ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలతో నిండి పోతుందిట.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `డ్రాగన్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే పీరియాడిక్ నేపథ్యంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా హైలైట్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా కథాంశం వైరల్ అవుతోంది. ఇది 1960ల నాటి ఆఫ్ఘనిస్తాన్ నేపథ్యంలో సాగే కథగా లీకైంది. అప్పట్లో రాజ్యమేలిన అక్రమ ఓపియం వ్యాపార ముఠాల మధ్య జరిగే ఆధిపత్య పోరాటాలను, ఆ భయంకరమైన పరిస్థితులను చిత్రం లో నీల్ కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నారుట. ఎన్టీఆర్ పోషిస్తోన్న పాత్ర ఇప్పటివ రకు ఆయన చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా అత్యంత క్రూరంగా ఉంటుందని ప్రశాంత్ నీల్ స్పష్టం చేశారు.
సాధారణ యాక్షన్ చిత్రాలకు భిన్నంగా కథానాయకుడి పాత్రలోని చీకటి కోణాలను ఆవిష్కరిస్తూ ఆ క్రూరత్వం వెనుక ఉన్న బలమైన ఉద్వేగాలను దర్శకుడు ఎలివేట్ చేబోతున్నారుట. ప్రేక్షకులకు ఇది మునుపెన్నడూ చూడని ఓ కొత్త స్థాయి సినిమాటిక్ అనుభూతిని అందించనుందంటున్నారు. 1960ల కాలం నాటి భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆ కాలపు వాతావరణం, ఆఫ్ఘన్ సంస్కృతిని తెరపై ప్రతిబింబించేలా చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పీరియాడిక్ డ్రామా కావడంతో ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ఆ కాలపు సెట్టింగుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.
ప్రశాంత్ నీల్ మార్క్ మేకింగ్ స్టైల్ పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌కు అదనపు బలాన్ని చేకూర్చనుంది. ఓపియం వ్యాపారం అనే అంశం చుట్టూ అల్లిన కథనం, ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలతో నిండి పోతుందిట. ఎన్టీఆర్ నటన కు నీల్ దర్శకత్వ ప్రతిభ తోడవడంతో సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తుంది. తారక్ లుక్, మ్యానరిజమ్స్ సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. సాంకేతికంగా సినిమా ఓ అద్భుతం కాబోతోంది. విజువల్స్, నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఆ నాటి ఆఫ్ఘనిస్తాన్‌లోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.
ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఉండే ఇంటెన్సిటీ ఈ చిత్రంలో మరింత ఎక్కువగా ఉండబోతుందని టీజర్, పోస్టర్లు బయటకు వచ్చాక తెలుస్తుందని సన్నిహిత వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. యాక్షన్ ప్రియులకు ఈ చిత్రం ఓ పండగలా ఉంటుందనడంలో సందేహం లేదు. మొత్తంగా డ్రాగన్ యాక్షన్ సినిమా మాత్రమే కాదు. బలమైన భావోద్వేగాల సమాహారం. ఎన్టీఆర్ నటనతో క్రూరమైన పాత్రను ఏ స్థాయిలో పండిస్తారో? చూడాలని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం భారతీయ సినిమా గమనాన్ని మరో మలుపు తిప్పుతుందనే ఆశాభావం అందరిలోనూ వ్యక్తమవుతోంది.