బ్లాక్ బాడీ ఖాన్ మినీ డ్రెస్ లో పాయల్ సెగలు.. ట్రెండీ ఫోజులతో హీటెక్కిస్తూ!
అందానికి సరికొత్త నిర్వచనం చెబుతూ.. ఎప్పటికప్పుడు ప్రేక్షకులలో ఊహించని పాపులారిటీని సొంతం చేసుకుంటుంది ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్.
అందానికి సరికొత్త నిర్వచనం చెబుతూ.. ఎప్పటికప్పుడు ప్రేక్షకులలో ఊహించని పాపులారిటీని సొంతం చేసుకుంటుంది ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్. అజయ్ భూపతి దర్శకత్వంలో 2018లో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది పాయల్. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె ఈ సినిమా మొదటి భాగంలో అందాలు ఆరబోస్తూ. బోల్డ్ స్క్రీన్ ప్రజెంట్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ముఖ్యంగా కుర్రకారు ఫేవరెట్ గా మారిపోయిన పాయల్.. క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ తో విలన్ గా అవతరించి, అందరిని ఆశ్చర్యపరిచింది. అటు అజయ్ భూపతి క్లైమాక్స్ ట్విస్ట్ కి ఇటు పాయల్ నటనకి సినీలోకం ఫిదా అయిపోయింది. అంతలా అద్భుతమైన నటన కనపరిచింది పాయల్.
ఇకపోతే ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది కానీ పాయల్ కి మాత్రం అనుకున్నంత స్థాయిలో సినిమాలు పడడం లేదు. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో అతిథి పాత్ర పోషించిన ఈమె.. సీత సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి అలరించింది. ఆ తర్వాత వచ్చిన ఆర్డిఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, తీస్ మార్ ఖాన్, జిన్నా, మాయాపేటిక ఇలా పలు చిత్రాలు చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చింది పాయల్. అయితే ఇవేవీ కూడా ఈమెకు ఆర్ఎక్స్ 100 మూవీ రేంజ్ లో విజయాన్ని ,గుర్తింపును అందించలేదు కానీ 2023లో మళ్ళీ అజయ్ భూపతి దర్శకత్వంలో మంగళవారం సినిమా చేసి తన నటన విశ్వరూపాన్ని చూపించింది. ముఖ్యంగా తనలోని నటిని అజయ్ తప్ప మరెవరు వెలికి తీయలేరు అనేట్టుగా నటించి అందరిని అబ్బురపరిచింది.
ప్రస్తుతం గోల్ మాల్ , ఏంజెల్ వంటి తమిళ చిత్రాలలో నటించిన ఈమె ఇటు తెలుగులో కిరాతక అనే సినిమాలో నటించింది. ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది . ఎం వీరభద్రం దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిజ సంఘటనల ఆధారంగా రూపొందిన ఒక కల్పిత కథ. డాక్టర్ నాగం తిరుపతిరెడ్డి విజన్ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తుండగా.. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందించారు. 2021లోనే అధికారికంగా ప్రకటించినప్పటికీ.. ఇప్పటికీ ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.
ఇకపోతే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న పాయల్.. తాజాగా మరో ట్రెండీ అవుట్ ఫిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. బ్లాక్ కలర్ నెట్టెడ్ మినీ ఫ్రాక్ ధరించిన ఈమె శరీరానికి అతుక్కుపోయేలా డీప్ వీ నెక్ తో ఈ డ్రెస్ ను డిజైన్ చేశారు. ముఖ్యంగా బ్లాక్ కలర్ హనీ బన్నీ మినీ డ్రెస్ ధరించిన ఈమె ఈ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు చెమటలు పట్టించింది. మొత్తానికైతే స్లీవ్ లెస్ మినీ బాడీ ఖాన్ ధరించిన పాయల్ ఈ ఫోటోలకు క్యాప్షన్ గా నేను తిరుగుతూ దానినే ఫ్యాషన్ గా మారుస్తున్నాను అంటూ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం పాయల్ షేర్ చేసిన ఈ లేటెస్ట్ అవుట్ ఫిట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.