అప్పుడు 1800 పారితోషికం ఇప్పుడు 14 ల‌క్ష‌లా!

పార్ట్ -2కి స్మృతి ఇరానీ అంగీక‌రించ‌డంతో పారితోషికం అంశం తెర‌పైకి వ‌స్తోంది. ఈ సీరియల్ కు గాను స్మృతి అక్ష‌రాల 14 ల‌క్ష‌లు ఛార్జ్ చేస్తున్నార‌ని కొత్త వార్త తెర‌పైకి వ‌చ్చింది.;

Update: 2025-07-09 02:45 GMT

కేంద్ర మాజీ మంత్రి, న‌టి స్మృతి ఇరానీ మ‌ళ్లీ మ్యాక‌ప్ వేసుకుంటున్నార‌ని ప్రచారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. తుల‌సీ విరానీ పాత్ర‌లో ప్రేక్ష‌కుల‌ని అలరించ‌డానికి స్మృతి ఇరానీ మ‌రోసారి రంగ‌ప్ర‌వేశం చేస్తున్న‌ట్లు కొన్ని రోజుల‌గా ప్ర‌చారం జ‌రుగుతోంది. `క్యుంకీ సాస్ బీ క‌భీ హూ తూ` సీరియ‌ల్ రెండ‌వ పార్ట్ క‌థ విన్నార‌ని.. న‌చ్చ‌డంతో అదే పాత్ర‌లో కొన‌సాగుతున్నార‌ని వెలుగులోకి వ‌చ్చింది. కానీ ఆమె వైపు నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది.

పార్ట్ -2కి స్మృతి ఇరానీ అంగీక‌రించ‌డంతో పారితోషికం అంశం తెర‌పైకి వ‌స్తోంది. ఈ సీరియల్ కు గాను స్మృతి అక్ష‌రాల 14 ల‌క్ష‌లు ఛార్జ్ చేస్తున్నార‌ని కొత్త వార్త తెర‌పైకి వ‌చ్చింది. అయితే ఇదే సీరియల్ కు ఆమె 25 ఏళ్ల క్రితం ఎపిసోడ్ కు 1800 మాత్ర‌మే తీసుకున్నారు. అంతే కాదు సీరియ‌ల్ లోకి రాక‌ముందు మెక్ డోన‌ల్స్డ్ లో ఉగ్యోగం చేరిన కొత్త‌లో ఆ కంపెనీలో కూడా నెల‌కు 1800 మాత్ర‌మే జీతంగా తీసుకు నేవారుట‌.

మ‌రి స్మృతి ఇరానీ ఎంట్రీకి సంబంధించి ఆమె ఇంత వ‌ర‌కూ ఎక్క‌డా అధికారికంగా స్పందించ‌లేదు. సోష‌ల్ మీడియా క‌థ‌నాల‌తోనే వైర‌ల్ గా మారారు. క్యుంకీ సాస్ బీ క‌భీ హూ తూ` అప్ప‌ట్లోనే 150 ఎపిసోడ్లు ప్ర‌సార‌మైంది. అక్క‌డ నుంచి కొన‌సాగింపుగా సీక్వెల్ ప్లాన్ చేస్తు న్నారు. దీనిలో భాగంగా కొన్ని కీల‌క‌మైన పాత్ర‌ల‌కు మొద‌టి భాగంలో న‌టించిన వారినే తీసుకునే ప్ర‌క్రియ కొన‌సాగుతుంది.

ఈ నేప‌థ్యంలో నిర్మాత ఏక్తాక‌పూర్ స్మృతి ఇరానీ సంప్ర‌దించ‌గా పాజిటివ్ గా స్పందించిన‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది. ఇద్ద‌రి మ‌ధ్య అగ్రిమెంట్ కూడా పూర్త‌యింద‌ని ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే స్మృతి ఇరానీ స్పందించాల్సిందే. సీరియ‌ల్ గా మొద‌లైన ప్ర‌యాణం రాజ‌కీయంగా కేంద్ర మంత్రిగా ఎదిగిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News