పర్సెంటేజ్‌పై ఎస్‌కెఎన్ హాట్ కామెంట్స్
ఎస్‌కెఎన్ ను తాజాగా థియేటర్ల బంద్, పర్సెంటేజ్ విధానంపై ఓ మీడియా ప్రతినిధి ప్రశ్రించాడు. దీనిపై స్పందిస్తూ ఎస్‌కెఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.;
మెగా కాంపౌండ్ వ్యక్తిగా ఇండస్ట్రీలో పేరున్న ఎస్‌కెఎన్ చిన్న సినిమాలతో నిర్మాతగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లలో సహ భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఆయన థియేటర్స్ సమస్య, థియేటర్ల బంద్, ఎగ్జిబిటర్ల పర్సంటేజ్‌పై తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. ఓ చిన్న సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఎస్‌కెఎన్ థియేటర్ల బంద్, పర్సంటేజ్ విధానంపై జరుగుతున్న రచ్చపై హాట్ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.
ఎస్‌కెఎన్ ను తాజాగా థియేటర్ల బంద్, పర్సెంటేజ్ విధానంపై ఓ మీడియా ప్రతినిధి ప్రశ్రించాడు. దీనిపై స్పందిస్తూ ఎస్‌కెఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సమస్యపై నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఈ పర్సంటేజ్‌లు, రెంట్‌లు, షేర్‌లు వీటికన్నా కూడా ఆడియన్స్ దగ్గరి నుంచి ఓ కంప్లైంట్ ఉంది. దాన్ని మనం ఎంత సీరియస్‌గా తీసుకుంటున్నాం. థియేటర్లకు వచ్చే ఆడియన్స్ శాతం రోజు రోజుకీ తగ్గిపోతోంది. మనం ఎంత పర్సంటేజ్ పంచుకుంటాం అన్నది తరువాత.
థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల పర్సంటేజ్ తగ్గిపోతున్నప్పుడు వాళ్లని థియేటర్లకు ఎలా తీసుకురావాలి అనే దానిమీద పెద్దలు ముందు దృష్టి పెడితే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే థియేటర్లకు ఎక్కువ స్థాయిలో ఆడియన్స్ వస్తే వచ్చేది కూడా అదే స్థాయిలో ఉంటుంది. దాంతో సమస్యలు తీరిపోతాయి. ఇప్పుడు వచ్చే ఆడియన్స్ తగ్గిపోయారు కాబట్టే రెవెన్యూ తగ్గిపోయింది.
దాంతో అంతా మా పరిస్థితి ఏంటీ? అంటే మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. ఆడియన్స్‌ని ఎక్కువ స్థాయిలో థియేటర్లకు రప్పించాలంటే కొన్ని సమస్యలున్నాయి. అదే ఇండస్ట్రీ సైడ్ నుంచి కూడా కొన్ని సమస్యలున్నాయి. వాటిని పరిష్కరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ప్రతీ చోట ఎవరిని కదిలించినా టికెట్ రేట్ల గురించే మాట్లాడుతున్నారు. అంతే కాకుండా థియేటర్లలో లభించే కూల్ డ్రింక్స్, పాప్ కార్న్ మరీ భరించలేకుండా అయ్యాయి. వీటి వల్లే తాము థియేటర్లకు దూరమవుతున్నామని ఆడియన్స్ వాదన.
ఆ సమస్యను ఎలా అధిగమించాలనే దానిపై చర్చ జరగాలి. అంతే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఫ్లెక్సిబుల్ టికెట్ రేట్లున్నాయి. అక్కడి విధానాన్ని మనం కూడా అవలంభిస్తే ఎక్కువ మంది థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుంది. అలా మనం చేయగలమా? లేదంటే నార్మల్ రోజుల్లో తక్కువ రేట్లకు స్టూడెంట్స్‌ని థియేటర్లకు రప్పించగలమా? వీకెండ్‌లో టికెట్ రేట్లు కొంచెం పెంచుకుని ముందుకు వెళ్లగలమా? వంటి వాటిపై ఇండస్ట్రీ పెద్దలు దృష్టిపెడితే మంచిదని నా అభిప్రాయం. తాజా పరిస్థితుల వల్ల థియేటర్లకు ఆడియన్ వచ్చే కల్చర్ చచ్చిపోతోంది' అన్నారు.