విలన్ గా వరుస ఫ్లాప్స్.. హీరోగా హిట్టు కొట్టగలడా?

సీనియర్ దర్శకుడు, నటుడు ఎస్ జే సూర్య తమిళంతోపాటు తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితులే.;

Update: 2025-07-19 16:22 GMT

సీనియర్ దర్శకుడు, నటుడు ఎస్ జే సూర్య తమిళంతోపాటు తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితులే. డైరెక్టర్, నటుడుగానే కాకుండా ప్లే బ్యాక్ సింగర్ గా, లిరిసిస్ట్ గా సినిమా రంగంలో ఆల్రౌండర్ గా పేరుగాంచారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఖుషి సినిమా తెరకెక్కించి భారీ హిట్ అందుకున్నారు. ఇక కొద్ది రోజులుగా తెలుగు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తనలోని నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

రీసెంట్ టైమ్స్ లో సూర్య తెలుగు సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి తనలోని నెగెటివ్ కోణాన్ని పరిచయం చేశారు. మహేశ్ బాబు స్పైడర్ సినిమాలో సైకో గా నటించి హీరోతో సమానంగా ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో సూర్య నటకు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇక గతేడాది నాని సరిపోదా శనివారం సినిమాలో పోలీస్ పాత్రలో నెగిటివ్ క్యారెక్టర్ లో అదరగొట్టారు.

ఇందులో టాయిలెట్ ఎక్కుడుందో నన్ను అడుగుతాడేంటి సూధా వీడు, కొట్టించుకొని నవ్వుతున్నావేంట్రా అనే కొన్ని డైలాగులు ఫుల్ వైరల్ అయ్యాయి. ఈ డైలాగ్స్ తో మీమ్స్ కూడా వచ్చాయి. ఈ ఏడాది రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ లోనూ సూర్యది నెగెటివి రోలే. ఇందులో అవినీతి పొలిటిషన్ గా మెప్పించారు. ఇక ఇండియన్ 2 లో కూడా రిచ్ విలన్ గా దర్శనమిచ్చాడు.

ఇలా పలు సినిమాల్లో విలన్ గా నటిస్తూ కనిపించిన సూర్యపై ప్రేక్షకులు మళ్లి విలన్ గా ఏ సినిమాలో నటిస్తారారోనని ఎదురు చూస్తున్నారు. అయితే విలన్ గా అద్బుతంగా నటిస్తున్నా, ఇందులో సరిపోదా శనివారం మినహా ఇతర సినిమాలు పెద్దగా హిట్ అవ్వలేదు. గేమ్ ఛేంజర్, ఇండియన్ 2 లో ఆయన పాత్రలు డిఫరెంట్ గానే ఉన్నా, సినిమాలు ఫ్లాప్స్ గా మిగిలిపోయాయి.

అయితే ఆయన ప్రస్తుతం రూటు మార్చారు. ఇప్పుడు విలన్ గా కాకుండా హీరోగా ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తానే హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా కిల్లర్ టైటిల్ తో రానుంది. తెలుగు, తమిళం సహా పాన్ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సూర్య సరసన ప్రీతి అస్రానీ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ శనివారం రిలీజ్ చేశారు. ఇందులో ఓ డిటెక్టివ్ ఔట్ ఫిట్ లో సూర్య కనిపిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ లో స్పోర్ట్ల్ కారు, చేతిలో గన్ పట్టుకొని స్టైలిష్ గా ఓ పోస్టర్ ఉండగా, రెడ్ శారీలో ఉన్న హీరోయిన్ భుజాలపై ఎత్తుకున్నట్లు మరో పోస్టర్ ఉంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడో అనౌన్స్ చేయలేదు. కాగా, ఇన్ని రోజులు విలన్ గా నటించి మెప్పించినా, ఆ సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి. మరి విలన్ గా వరుస ఫ్లాప్స్ పడుతున్న సమయంలో హీరోగా సూర్య హిట్టు కొట్టగలడా అని సినీ ప్రియులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని సూర్య ప్లాన్ చేస్తున్నాడు. మరి హీరోగా ఎలాంటి ఫలితాన్ని అందుకంటుంటాడో చూడాలి.

Tags:    

Similar News