ఒక్కో హీరోకి ఇద్దరేసి భార్యలు.. అందుకే నాకు పిల్లనివ్వనన్నారు.. హీరో సూర్య తండ్రి చెప్పిన షాకింగ్ నిజాలు!
స్టార్ హీరో సూర్య సహనటి జ్యోతికను ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి కోసం అతడు ఏకంగా4 సంవత్సరాలు ఎదురు చూసాడని తండ్రి శివకుమార్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.
స్టార్ హీరో సూర్య సహనటి జ్యోతికను ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి కోసం అతడు ఏకంగా4 సంవత్సరాలు ఎదురు చూసాడని తండ్రి శివకుమార్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే తన పెళ్లికి పెద్దల్ని ఒప్పించే సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి సీనియర్ నటుడు శివకుమార్ మాట్లాడారు. తాను దాదాపు 38 సినిమాలు చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని.. అయితే `సినిమా కుర్రాడికి` తమ కూతురిని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదని తెలిపారు.
ఆ కాలంలో జెమినీ గణేషన్‌కు ఇద్దరు భార్యలు, ఎంజీఆర్‌కు ముగ్గురు.. ఏవీఎం రాజన్‌కు ఇద్దరు భార్యలు ఉండటంతో.. అందగాళ్లయిన నటులందరూ అలాగే ప్రవర్తిస్తారనే అపోహతో తనకూ అలాగే జరుగుతుందని అందరూ భావించారని.. చివరికి ఒక వ్యక్తి తన కూతురు లక్ష్మీ కుమారినిచ్చి వివాహం చేయగా..తమకు కుమారులు సూర్య, కార్తీలతో పాటు కుమార్తె బృంద జన్మించారని గుర్తుచేసుకున్నారు.
తన కుమారుడు సూర్య- జ్యోతికల వివాహ బంధం.. వారి ప్రేమ ప్రయాణం గురించి శివకుమార్ మాట్లాడారు. సూర్య ఎవరినైనా ప్రేమిస్తే కేవలం తాను ఇష్టపడిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని ముందే స్పష్టం చేశాడని గుర్తుచేసుకున్నారు. సూర్య తన తల్లితో మాట్లాడుతూ ``ఎవరెవరో అమ్మాయిలను ప్రేమించడం కుదరదు`` అని చెప్పాడని శివకుమార్ తెలిపారు. ఆ తర్వాత ముంబైకి చెందిన జ్యోతికను ప్రేమించిన సూర్య, తాను పెళ్లి చేసుకుంటే ఆమెనే చేసుకుంటానని పట్టుదలతో నాలుగు సంవత్సరాలు వేచి చూసి చివరకు వివాహం చేసుకున్నాడని వెల్లడించారు.
పెళ్లి తర్వాత జ్యోతిక ముంబైకి వెళ్లిపోయే అవకాశం ఉన్నా ఆమె అలా చేయకుండా సూర్య తల్లిదండ్రులతో కలిసి ఏకంగా 18 సంవత్సరాలు అత్తమామలతో కలిసి ఒకే కుటుంబంతో నివసించిందని శివకుమార్ ప్రశంసించారు. ప్రస్తుత కాలంలో చాలామంది పెళ్లైన వెంటనే పిల్లల్ని కనడానికి ఇష్టపడకపోవడం.. భర్తను తల్లిదండ్రులకు దూరంగా వేరు కాపురానికి తీసుకెళ్లడం చేస్తుంటారని... కానీ జ్యోతిక మాత్రం అత్తింట్లోనే ఉంటూ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిందని కొనియాడారు.
ప్రస్తుతం ఈ దంపతుల పిల్లలు దియా, దేవ్ విదేశాల్లో చదువుకుంటున్నారని శివకుమార్ తెలిపారు. సూర్య, జ్యోతిక ఇటీవల తమ 20వ వివాహ వార్షికోత్సవాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలో వేడుకగా ఘనంగా జరుపుకున్నారని.. రెండు దశాబ్దాలుగా వీరి కాపురం ఇంత అన్యోయంగా సాగడం తనకు గర్వంగా ఉందని శివకుమార్ ఆనందం వ్యక్తం చేశారు.