రీమేక్‌ల కథ ముగిసిందా? ఇండియన్ సినిమా మారుతున్న తీరు ఇదే!
| ఒక ఏరియా కి మాత్రమే పరిమితమైన కథలు కాకుండా ఇండియా వైడ్ గా ప్రభావాన్ని చూపించే కథలకి ఎక్కువ ఆదరణ దక్కుతుంది.
ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది. ఏ భాషలో సినిమా చేసినా కూడా ఇతర భాషల్లోని ప్రేక్షకులు ఆ సినిమాని చూసి ఆదరిస్తున్నారు. ఒకప్పుడు ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాని ఇంకొక భాషలో రీమేక్ చేసి సక్సెస్ లను సాధించేవారు. దీనివల్ల ఒరిజినల్ సినిమాలో యాక్ట్ చేసిన హీరోలకు, దర్శకులకు అలాగే రీమేక్ చేసిన హీరోలకు దర్శకులకు అందరికి మంచి క్రేజ్ అయితే దక్కేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. నిజానికి రీమేక్ సినిమా చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే సినిమా ఎలా ఉంటుందో హీరో, నిర్మాత ముందుగానే చూసేసారు. కాబట్టి ఆ క్మోవీకి బడ్జెట్ ఎంతవౌతుంది. అది ఎంత కెలక్షన్స్ ను రాబట్టచ్చు అనేది అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్లే ఆ రీమేక్ సినిమాలను పర్ఫెక్ట్ గా కథ ను మన నేటివిటీ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తే సినిమా సక్సెస్ అందుతుందని భావించేవారు.
అప్పట్లో కొంతమంది స్టార్ హీరోలు సైతం వాళ్ళకి వరుస ప్లాపులు వచ్చినప్పుడల్లా ఒక రీమేక్ సినిమాతో వచ్చి సక్సెస్ లను సాధించేవారు. ఇప్పుడు అలాంటి సదుపాయం లేకుండా పోయింది. ఒకేసారి సినిమాని ఇండియా వైడ్ గా ఇతర భాషల్లో డబ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. అందులో కొన్ని సినిమాలు ఆడితే మరికొన్ని సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. ఒకవేళ అలా రిలీజ్ చేయకపోయిన కూడా ఆ మూవీ ఒక లాంగ్వేజ్ లో హిట్ అయిందంటే చాలు కొన్ని రోజులకు ఓటీటీ లో డబ్బింగ్ వెర్షన్ తో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మరికొన్ని సినిమాలను పాన్ ఇండియా రిలీజ్ చేయకపోయిన ఇతర భాషల్లో తెరకెక్కే ఆ ప్రాంతానికి సంబంధించిన సినిమాలు సక్సెస్ సాధిస్తే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆ సినిమాలను చూస్తున్నారు.
ఉదాహరణకి నార్త్ లో వచ్చిన 'హనుమాన్ అంశ్' మూవీ ని ఇతర భాషల వారు కూడా చూసి ఆదరించారు. అందువల్లే ఆ మూవీ సూపర్ హిట్ అయింది. ఇలాంటి సినిమాలు ప్రేక్షకుడికి అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి మళ్ళీ అదే కంటెంట్ తో రీమేక్ చేసే అవసరం లేకుండా పోతుంది. ఒకప్పుడు ఇతర భాషల్లో సినిమా సక్సెస్ అయిన కూడా అది ప్రేక్షకులు చూడటానికి అందుబాటులో ఉండేది కాదు. కాబట్టి సక్సెస్ ఫుల్ సినిమాను కొన్ని సంవత్సరాల తరువాత కూడా రీమేక్ చేశారు కానీ ఇప్పుడు అలా లేదు...అయితే కొన్ని సినిమాలను తెలుగు లో డబ్ చేసిన కూడా మళ్ళీ రీమేక్ చేశారు అవి సరిగ్గా ఆడకపోవడంతో నిర్మాతలు చేతులు కాల్చుకున్నారు...ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే రీమేక్ సినిమాలను చేయకపోవడమే బెటర్...ఒక రకంగా వాటికి కాలం చెల్లిపోయిందనే చెప్పాలి...