వివేక్ ఆత్రేయ కథ ను రజినీకాంత్, బాలయ్య రిజెక్ట్ చేయడానికి కారణమేంటంటే?

వాళ్ళిద్దరికి ఆ కథ బాగా నచ్చినప్పటికి కొన్ని అనివార్య కారణాలవల్ల వాళ్ళు ఆ సినిమాను చేయలేకపోయారు. దాంతో వివేక్ ఇప్పుడు రవితేజ తో ఒక సినిమాని చేస్తున్నాడు.

Update: 2026-09-29 05:26 GMT

'మెంటల్ మదిలో' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన 'వివేక్ ఆత్రేయ' ఆ తర్వాత చేసిన 'బ్రోచేవారెవరురా' సినిమాతో మంచి సక్సెస్ ని సాధించాడు. ఇక ఆ వెంటనే నానితో 'అంటే సుందరానికి', 'సరిపోదా శనివారం' అనే సినిమాలను చేసి సక్సెస్ లను సాధించాడు. ఇక ఇప్పుడు ఆయన రవితేజ తో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి ముందు ఆయన రజనీకాంత్, బాలయ్య బాబు లను కలిసి ఒక కథనైతే వినిపించాడు. వాళ్ళిద్దరికి ఆ కథ బాగా నచ్చినప్పటికి కొన్ని అనివార్య కారణాలవల్ల వాళ్ళు ఆ సినిమాను చేయలేకపోయారు. దాంతో వివేక్ ఇప్పుడు రవితేజ తో ఒక సినిమాని చేస్తున్నాడు.

ఏది ఏమైనా కూడా రజినీకాంత్, బాలయ్య లాంటి స్టార్ హీరోలు వివేక్ ఆత్రేయతో సినిమా చేయకపోవడానికి గల కారణం ఏంటంటే అప్పటికి వాళ్ళకి కొన్ని కమిట్మెంట్స్ ఉండటం ఒకటైతే వివేక్ ఆత్రేయ రాసిన కథ ఒక డిఫరెంట్ జానర్ లో ఉంటుందట. వాళ్ళ నుంచి ప్రేక్షకులు అలాంటి కథలను ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియక వదిలేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే కథ విన్న వెంటనే ఇద్దరు హీరోలు బావుందని చెప్పారట. నిజానికి వివేక్ ఆత్రేయ లాంటి దర్శకుడు స్క్రీన్ ప్లే లో అద్భుతాలు చేస్తూ ఉంటాడు. అందువల్లే అతనికి డైరెక్టర్ గా చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపైతే వచ్చింది. మరలాంటి దర్శకుడు ఇప్పుడు రవితేజతో చేస్తున్న సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. దాని కోసం ఆయన ఏం చేస్తాడు ఏ రేంజ్ లో సినిమాను తెరకెక్కిస్తాడు అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే వివేక్ ఆత్రేయా లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరమనే చెప్పాలి.

స్క్రీన్ ప్లే బేస్డ్ కథలను రాయడంలో తనకు తానే దిట్ట అందువల్లే ఈ మధ్యకాలంలో ఉన్న ది బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ లలో వివేక్ ఆత్రేయ కూడా ఒకరిగా నిలుస్తాడు. అలాంటి వివేక్ ఆత్రేయ రవితేజ ను ఏ రేంజ్ లో చూపించబోతున్నాడనేదే ఇప్పుడు కీలకమైన అంశంగా మారింది. రీసెంట్ గా రవితేజ 'ఇరుముడి' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కాబట్టి రాబోయే సినిమా అంతకు మించిన సక్సెస్ ను సాధించేలా ఉండాలి. దానికంటే కొంచెం తగ్గినా కూడా ప్రేక్షకులు ఆ సినిమాని రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని వివేక్ ఆత్రేయ ఈ సినిమాని తెరకెక్కించాల్సిన అవసరమైతే ఉంది...

Tags:    

Similar News