దసరా బరిలో జైలర్ 2 & రణబాలి ప్రమోషనల్ స్ట్రాటజీ!

పండుగ వాతావరణంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న `జైలర్ 2`, విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న జంటగా తెర‌కెక్కుతోన్న `రణబాలి` చిత్రాలు ప్ర‌ధాన‌ ఆకర్షణగా నిలిచాయి

Update: 2026-09-29 03:42 GMT

దసరా పండుగ అత్యంత ఆసక్తికరంగా మారబోతోంది. పండుగ వాతావరణంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న `జైలర్ 2`, విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న జంటగా తెర‌కెక్కుతోన్న `రణబాలి` చిత్రాలు ప్ర‌ధాన‌ ఆకర్షణగా నిలిచాయి. రెండు చిత్రాలు దసరా కానుకగా ఒక్క రోజు గ్యాప్ లోనే విడుద‌ల‌వుతుండ‌టంతో స‌న్నివేశం ఆస‌క్తిక‌రంగా మారుతోంది.

నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న `జైలర్ 2` ( అక్టోబ‌ర్15) పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. మొదటి భాగంలో టైగర్ ముత్తువేల్ పాండ్యన్‌గా రజినీకాంత్ చూపించిన పవర్ ఫుల్ యాక్షన్ అండ్ మేనరిజమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో సీక్వెల్‌లో రజినీకాంత్ పాత్ర ఎలా ఉండబోతోంది? యాక్షన్ ఎపిసోడ్స్ ఏ స్థాయిలో తెరకెక్కించారనే విషయంపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న న‌టిస్తోన్న `రణబాలి`( అక్టోబ‌ర్ 16) చిత్రం కూడా అదే రేంజ్‌లో అంచనాలను పెంచేస్తోంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా పీరియాడికల్ యాక్షన్ డ్రామా స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన కొన్ని చీకటి అధ్యాయాలు, యదార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటోంది.

అయితే ఈ రెండు చిత్రాల ప్రమోషన్స్ కోసం ఎంచుకున్న వినూత్న వ్యూహం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రెండు చిత్రబృందాలు టీజర్లు, ట్రైలర్లతో పాటు మేకింగ్ డాక్యుమెంటరీల ద్వారా ప్రమోషన్లు నిర్వహించే ఒకే రకమైన స్ట్రాటజీని ఫాలో అవుతున్నాయి. ఇప్పటికే `జైలర్ 2` టీమ్ `జైలర్ 2 అన్‌లాక్డ్` పేరుతో విడుదల చేసిన స్పెషల్ డాక్యుమెంటరీ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలవగా.. `రణబాలి` బృందం కూడా ఏకంగా నాలుగు ఎపిసోడ్ల భారీ మేకింగ్ డాక్యుమెంటరీ సిరీస్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

సినిమా వెనుక ఉన్న కష్టం, టెక్నికల్ విలువలు, లొకేషన్లు , నటీనటుల శ్రమను డాక్యుమెంటరీ రూపంలో నేరుగా ప్రేక్షకులకు చూపించడం వల్ల సినిమాపై మరింత కనెక్టివిటీ, విశ్వసనీయత పెరుగుతాయని నిర్మాతలు భావిస్తు న్నారు. సాధారణ ప్రచార చిత్రాల కంటే ఇలాంటి బిహైండ్-ది-సీన్స్ డాక్యుమెంటరీలు జాతీయ స్థాయిలో సినీ ప్రేమికులను ఆకట్టుకుంటూ సినిమా మేకింగ్ ప్రమాణాలను ఉన్నత స్థాయిలో నిలబెడుతున్నాయి.

రెండు సినిమాల బాట ఒక‌టే కావ‌డంతో సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పవర్ ఫుల్ మాస్ యాక్షన్ అంశాలతో `జైలర్ 2` వస్తుంటే? వైవిధ్యమైన చారిత్రక కథాంశంతో `రణబాలి` రేసులో ఉంది. మ‌రి ద‌స‌రా బ‌రిలో ఎవ‌రు విజేత అవుతారు? అన్న‌ది చూడాలి. అయితే ఈ రెండు సినిమాల ప్ర‌భావం చాలా సినిమాల‌పై ప‌డుతుంది. పండ‌గ నేప‌థ్యంలో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో థియేట‌ర్ల ప‌రంగా ఇబ్బంది ఎదుర‌వుతుంది.

Tags:    

Similar News