ఒకే ఒక్క ఫోటోతో రొమాంటిక్ క‌పుల్ ఇంట‌ర్నెట్‌లో షేకింగ్

అలియా భట్ తన భర్త, ప్రముఖ నటుడు రణ్‌బీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ప్రత్యేకమైన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Update: 2026-09-29 03:39 GMT

అలియా భట్ తన భర్త, ప్రముఖ నటుడు రణ్‌బీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ప్రత్యేకమైన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరినీ ఆకట్టుకునే కొన్ని వ్యాఖ్య‌లు ఇప్పుడు వెబ్ ప్ర‌పంచంలో చ‌ర్చ‌గా మారాయి. ముఖ్యంగా ఈ పోస్ట్‌లోని మొదటి ఫోటో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.




ఈ పోస్ట్‌లోని మొదటి స్లైడ్‌లో రణ్‌బీర్‌ను అలియా భట్ త‌న ఒడిలో కూచోబెట్టుకుని కాస్త‌ గారభంగా ఇంకాస్త ప్రేమ‌గా.. త‌మ‌కంగా క‌ళ్ల‌లోకి క‌ళ్లు పెట్టి చూస్తూ క‌నిపించింది. ఈ ఒక్క‌ ఫోటో నెటిజనుల్లో బిగ్ డిబేట్ కి తెర తీసింది. `అలియా కే పతి`, `క్యూటీస్` అంటూ అభిమానులు తమ ప్రేమను కురిపిస్తున్నారు. అసలు మొదటి ఫోటో చూశాక తాము ఆ పోస్ట్ నుంచి ముందుకు వెళ్లలేకపోతున్నామని కొందరు ఫ్యాన్స్ సరదాగా కామెంట్లు చేయడం విశేషం.




ఈ క్యూట్ మూమెంట్స్‌పై అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించారు. అనితా ష్రాఫ్ అదజానియా, షిబానీ అక్తర్, సబా ప‌టౌడి వంటి ప్రముఖులు రణ్‌బీర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ జంటను ప్రశంసించారు. హుస్సేన్ దలాల్ వంటి దర్శకులు కూడా ఈ ఫోటోల ప్రత్యేకతను కొనియాడుతూ సరదాగా స్పందించారు.




సోషల్ మీడియాలో ఈ పోస్ట్ కింద నెటిజన్ల మధ్య రకరకాల చర్చలు నడిచాయి. ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకుంటున్నారో ఈ ఫోటోలు చెబుతున్నాయని.. భార్య చేతిలో అలా ముద్దుగా గారబం చేయించుకోవడం రణ్‌బీర్ అదృష్టమని ఫ్యాన్స్ కామెంట్లు చేశారు. ``మీ ఇద్దరూ ఇలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి`` అంటూ ఆశీస్సులు అందజేశారు. అదే స‌మ‌యంలో యుగ‌పురుషుడు, స‌చ్ఛీలుడు అయిన లార్డ్ శ్రీ‌రాముడిగా న‌టిస్తూ, ఇలా రోమాంచితంగా త‌న‌ను తాను ప్రెజెంట్ చేసుకోవ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తుంద‌ని ఒక యువ‌కుడు అభిప్రాయ‌ప‌డ్డారు.




మొత్తానికి అలియా భట్ షేర్ చేసిన ఒకే ఒక్క బర్త్‌డే పోస్ట్ చాలా చ‌ర్చ‌ల‌కు దారితీసింది. కేవలం ఒక పుట్టినరోజు శుభాకాంక్షగానే కాకుండా.. ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్‌గా వారిద్దరిపై ఉన్న క్రేజ్‌ను మరోసారి నిరూపించింది. క్షణాల్లో వైరల్ అయిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచాయి.




Tags:    

Similar News