ఇకపై మంచి సినిమాలు తీయకూడదా?
బాలీవుడ్ లో సీనియర్ రైటర్ గా జావేద్ అక్తర్ కి ఉన్న గుర్తింపు, గౌరవం ఎంతో గొప్పవి.;
బాలీవుడ్ లో సీనియర్ రైటర్ గా జావేద్ అక్తర్ కి ఉన్న గుర్తింపు, గౌరవం ఎంతో గొప్పవి. 90లలో పరిశ్రమను శాసించిన మేటి రచయితగా జావేద్ అక్తర్ ఏం చెప్పినా లేదా సూచించినా పరిశ్రమ వింటుంది. ప్రేక్షకులకు కూడా ఆయన మాటలను నిశితంగా గమనిస్తారు. అందుకే ఇప్పుడు ఆయన తన సన్నిహితుడు, మిత్రుడు అయిన అమీర్ ఖాన్ సినిమా సీతారే జమీన్ పార్ గురించి చేసిన వ్యాఖ్య క్షణాల్లో వైరల్ గా మారింది.
జావేద్ సాబ్ ఆమిర్ ఖాన్ ప్రయత్నాన్ని అభినందించారు. 'సీతారే జమీన్ పర్' బాక్సాఫీస్ దూకుడును ప్రశంసించారు. మంచి చిత్రాలకు ప్రేక్షకులు లేరని ఎవరు అంటున్నారు? 'సీతారే జమీన్ పర్' రెండవ రోజు బాక్సాఫీస్ వద్ద సాధించిన రికార్డు దూకుడు గురించి తెలుసుకుని చాలా సంతోషంగా ఉందని జావేద్ అన్నారు.
ఆసక్తికరంగా అమీర్ ఖాన్ వర్సెస్ జావేద్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. నిజానికి జాతీయ అవార్డుల సినిమా `లగాన్` విషయంలో జావేద్ అపనమ్మకంగా ఉన్నారని తాజా ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ వెల్లడించారు. తనను లగాన్ చేయొద్దని కూడా జావేద్ వారించే ప్రయత్నం చేసారు. కానీ తాను విభేధించాడు. ఒక గ్రామంలో ధోతీలో హీరో ఉన్న చిత్రం రామాయణాన్ని గుర్తుకు తెచ్చే ఇతివృత్తాలతో పాటలు ఉండటంపై జావేద్ అక్తర్ సందేహం వ్యక్తం చేశాడని ఆయన అన్నారు. జావేద్ అక్తర్ ఆలోచన ప్రకారం.. అప్పట్లో లగాన్ ఒక ఫ్లాప్ సినిమాకి ఉండాల్సిన అన్ని లక్షణాలు కలిగి ఉంది. కానీ చరిత్ర మరోలా నిరూపించింది. లగాన్ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా, వాణిజ్యపరంగా, విమర్శనాత్మకంగా భారతీయ సినీ పరిశ్రమలో ఒక మైలురాయిగా కూడా నిలిచింది.
తారే జమీన్ పార్ సీక్వెల్ గా రూపొందించిన సీతారే జమీన్ పార్ ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా థియేటర్లకు జనాల్ని రప్పించడంలో విఫలమైంది. ప్రశంసలు కురిసినా కానీ, బాక్సాఫీస్ ఆదాయం అంతగా లేదు. కానీ జావేద్ పాజిటివ్ నోట్ తో జనాల్ని థియేటర్లకు రప్పించాలని ప్రయత్నించారు. సీతారే జమీన్ పర్ రూ.10.7 కోట్లతో ప్రారంభమైంది. ఆదివారం రూ.27.25 కోట్లు దక్కడం బిగ్ రిలీఫ్. అత్యధిక సింగిల్ డే వసూళ్లను చూసాక కూడా సోమవారం ఈ సినిమా వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. సోమవారం కేవలం 8.50 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇప్పుడు సినిమా మొత్తం కలెక్షన్ రూ.75.15 కోట్లుగా ఉంది. ఒక సూపర్ స్టార్ సినిమాకి మొదటి మూడు రోజుల్లో 300 కోట్లు రావాలి. అప్పుడు మాత్రమే పాన్ ఇండియా విజయం సాధించినట్టు. దీనికి అమీర్ చాలా దూరంగా ఉన్నాడు.
ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వం వహించిన `సితారే జమీన్ పర్` చిత్రం జూన్ 20న విడుదలైంది. ఈ చిత్రంలో జెనీలియా దేశ్‌ముఖ్ కూడా నటించింది. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది. సమీక్షలు పాజిటివ్ గానే ఉన్నాయి.