వయసు 94.. ఉత్సాహం మాత్రం యంగ్.. సింగీతం డ్రీమ్ ప్రాజెక్ట్ రీస్టార్ట్?

సినిమాపై ప్యాషన్ ఉంటే వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే అని నిరూపించారు లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు.

Update: 2026-06-18 00:30 GMT

సినిమాపై ప్యాషన్ ఉంటే వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే అని నిరూపించారు లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు. 94 ఏళ్ల వయసులో కూడా ఆయన మెగాఫోన్ పట్టి సరికొత్త వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఆయన 40 ఏళ్ల కల అయిన ‘సింగ్ గీతం’ అనే డైలాగులు లేని వినూత్న మ్యూజికల్ ఫాంటసీ సినిమాను ఎట్టకేలకు వెండితెరపైకి తెచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ వయసులో కూడా ఆయన మరో డ్రీమ్ ప్రాజెక్ట్‌ను రీస్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆ వివరాలు చూద్దాం..

నాగ్ అశ్విన్ తోడుగా అద్భుత ప్రయోగం:

సింగీతం గారి మైండ్ బ్లోయింగ్ ఆలోచనలకు 'కల్కి 2898 AD' డైరెక్టర్ నాగ్ అశ్విన్ తోడయ్యారు. సింగీతం శ్రీనివాసరావు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘సింగ్ గీతం’ సినిమాను నిర్మించి, థియేటర్లలోకి తీసుకురావడంలో నాగ్ అశ్విన్ కీలక పాత్ర పోషించారు. ఇక మాటలు లేకుండా కేవలం పాటల రూపంలోనే క్యారెక్టర్లు మాట్లాడుకునే ఈ విభిన్నమైన సినిమా, బాక్సాఫీస్ వద్ద విమర్శకుల నుంచి భారీ ప్రశంసలు అందుకుంది.

40 ఏళ్ల నాటి ‘బెంగళూరు నాగరత్నమ్మ’ కల:

‘సింగ్ గీతం’ సక్సెస్ ఇచ్చిన జోష్‌తో సింగీతం గారు ఇప్పుడు తన తదుపరి డ్రీమ్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టారు. ఒక సాధారణ భోగినిగా (భోగం పడతిగా) తన జీవితాన్ని మొదలుపెట్టి, ఆ కాలపు సామాజిక ఆంక్షలను ఎదిరించి కర్ణాటక సంగీతంలో లెజెండ్‌గా మారిన 'బెంగళూరు నాగరత్నమ్మ' జీవిత చరిత్ర ఆధారంగా ఆయన ఒక బయోపిక్ తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఇక దీనికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా ఇప్పటికే సిద్ధంగా ఉంది అని టాక్

సమంత, అనుష్కల నుంచి నాగ్ అశ్విన్ చేతుల్లోకి:

ఈ బయోపిక్ కథను సింగీతం గారు గతంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అయిన సమంత రుత్ ప్రభు, అనుష్క శెట్టిలకు కూడా వినిపించారు. ఇక కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కాంబినేషన్లు కుదరలేదు. దాంతో, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సింగీతం గారు మరోసారి నాగ్ అశ్విన్‌ను సంప్రదించారు. ఇక 94 ఏళ్ల వయసులో కూడా ఆయన మరోసారి 'యాక్షన్' చెప్పడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

ఆదిత్య 369, భైరవద్వీపం, పుష్పక విమానం వంటి ఎన్నో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సింగీతం శ్రీనివాసరావు గారు.. ఈ వయసులో కూడా కొత్త కథల కోసం తపన పడటం నిజంగా గ్రేట్. ఇక నాగ్ అశ్విన్ సపోర్ట్‌తో ‘బెంగళూరు నాగరత్నమ్మ’ బయోపిక్ గనుక పట్టాలెక్కితే, అది తెలుగు సినిమా చరిత్రలోనే మరొక అపురూపమైన చిత్రంగా నిలిచిపోవడం ఖాయం. ఈ లెజెండరీ డైరెక్టర్ ఉత్సాహం నేటి తరం దర్శకులకు ఒక పెద్ద ఇన్‌స్పిరేషన్.

Tags:    

Similar News