• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పెళ్లి పుకార్ల‌పై స్టార్...

పెళ్లి పుకార్ల‌పై స్టార్ హీరో క్లారిటీ?

| తమిళ స్టార్ హీరో శింబు అలియాస్ సిలంబరసన్ తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చిన తర్వాత తొలిసారిగా బయటకు వచ్చారు

By - Tupaki Desk
Update: 2024-06-03 14:10 GMT

తమిళ స్టార్ హీరో శింబు అలియాస్ సిలంబరసన్ తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చిన తర్వాత తొలిసారిగా బయటకు వచ్చారు. అత‌డు ఇండియన్ 2 ఆడియో లాంచ్‌లో సందడి చేసాడు. ఆడియో లాంచ్ తర్వాత వేదిక వెలుపల గుమిగూడిన కొంద‌రు పాత్రికేయులతో శింబు మాట్లాడారు. అయితే సిలంబరసన్ పెళ్లి పుకార్ల గురించి అస్స‌లు ప్రస్తావించనేలేదు. తన ఓటు వేయలేక‌పోయినందుకు బాధ‌ప‌డ్డాడు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో శింబు తన ఓటు వేయలేకపోయాడు.

ఇదే విషయమై విలేకరులతో మాట్లాడుతూ తాను షూటింగ్‌లో ఉన్నానని, ఓటు వేయడానికి రాలేకపోయానని తెలిపాడు. ``ఇది పొరపాటు అని నాకు తెలుసు.. కానీ నేను షూట్‌ను రద్దు చేయలేకపోయాను.. నేను ఇంకా పెద్దగా ఎద‌గ‌లేదు.. దాంతో షూట్ షెడ్యూల్‌ను కూడా పరిశీలించాల్సి వచ్చింది`` అని అన్నాడు. నేను నా ఓటు వేయలేకపోయినందుకు బాధగా ఉందని కూడా అన్నాడు.

ప్ర‌స్తుతం మ‌ణిర‌త్నం దర్శ‌క‌త్వంలో రూపొందుతున్న థ‌గ్ లైఫ్‌లో శింబు న‌టిస్తున్నాడు. ఇది త‌న కెరీర్ 48వ చిత్రం. బిజీ షెడ్యూళ్ల‌తో అత‌డికి చాలా స‌మ‌స్య‌లున్నాయి. కేవ‌లం ఓటు వేయ‌లేక‌పోవ‌డం గురించే కాదు.. తన షూటింగ్ షెడ్యూల్ కారణంగా భార‌తీయుడు 2 (ఇండియన్ 2) ఆడియో లాంచ్‌కు ఆలస్యంగా చేరుకున్నానని చెప్పాడు.

అయితే శింబు ఓవైపు షూటింగులో బిజీగా ఉంటే, అత‌డికి త్వ‌ర‌లోనే పెళ్లి కాబోతోంది అంటూ ప్ర‌చారం సాగుతోంది. గత వారం ప్రముఖ తమిళ వార్తా పోర్టల్ శిలంబరసన్ తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఒక పెద్ద నటుడి కుమార్తెను వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయ‌ని క‌థ‌నం వెలువ‌రించింది. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందిని కూడా రాసింది. సిలంబరసన్ త్వరలో సెటిల్ అవ్వాలని అతని తల్లిదండ్రులు ఆత్రుత‌గా ఉన్నారని తాజా పుకార్లతో స్ప‌ష్ఠ‌త వ‌చ్చింది. కాబోయే వధువు ఎవరనేది ఇంకా గోప్యంగా ఉంచగా, ఈ వార్త సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించి హాట్ టాపిక్‌గా మారింది. ఊహాగానాలకు ముగింపు పలికే అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    
  • Simbu 
  • Thuglifemovie 
  • Maniratnam 
  • Filmindustry 
  • Loksabhaelections 
  • Simbumarriage 
  • Indian2movie 
  • Kamalhaasan 

Similar News

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS