బిడ్డొచ్చే వేళ స్టార్ హీరోకి క‌లిసొచ్చేనా?

కియ‌రా అద్వానీ లాంటి ట్యాలెంటెడ్ న‌టిని ప్రేమించి పెళ్లాడాడు సిద్ధార్థ్ మ‌ల్హోత్రా. అయితే పెళ్లి త‌ర్వాత ఎందుక‌నో సిద్ధార్థ్ కి స‌రైన హిట్టు ప‌డ‌లేదు;

Update: 2025-05-17 21:30 GMT

కియ‌రా అద్వానీ లాంటి ట్యాలెంటెడ్ న‌టిని ప్రేమించి పెళ్లాడాడు సిద్ధార్థ్ మ‌ల్హోత్రా. అయితే పెళ్లి త‌ర్వాత ఎందుక‌నో సిద్ధార్థ్ కి స‌రైన హిట్టు ప‌డ‌లేదు. ఇటీవ‌లే కియ‌రా ఫ్రెగ్నెన్సీని క‌న్ఫామ్ చేసింది. అయితే ఇక‌పై అత‌డి కెరీర్ గ్రాఫ్ లో ఛేంజ్ అనూహ్యంగా ఉంటుంద‌ని అభిమానులు ఊహిస్తున్నారు.

త‌న భార్య త‌న‌కు బిడ్డ‌ను ఇచ్చే లోపే అత‌డు మ‌రో బంప‌ర్ హిట్టు కొట్టాల‌ని క‌సితో ఉన్నాడ‌ట‌. త‌దుప‌రి మల్హోత్రా ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో న‌టించ‌నున్నాడు. కోటా ఫ్యాక్టరీ, పంచాయత్ వంటి ఐకానిక్ సిరీస్‌లను కొనుగోలు చేసిన టివిఎఫ్ స్టూడియో ఇప్పుడు సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో `వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్` అనే జానపద థ్రిల్లర్‌ను తెర‌కెక్కించ‌నుంది. దీనికి దీప‌క్ మిశ్రా ద‌ర్శ‌కుడు. అద్భుత క‌థ‌ల ఎంపిక‌ల‌తో టివిఎఫ్ ఇప్ప‌టికే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

కోటా ఫ్యాక్ట‌రీ, పంచాయ‌త్ లాంటి వైవిధ్య‌మైన సిరీస్ ల‌తో ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షించిన టీవీఎఫ్ మ‌రో వైవిధ్య‌మైన స్క్రిప్టుతో విజ‌యం కోసం ఎదురు చూస్తున్న‌ సిద్ధార్థ్ లోటును భ‌ర్తీ చేస్తుంద‌ని భావిస్తున్నారు. టీవీఎఫ్ తో పాటు ఏక్తా క‌పూర్ బాలాజీ టెలీఫిలింస్ ఇందులో పెట్టుడులు పెడుతుంది.

సిద్ కి షేర్షా త‌ర్వాత స‌రైన హిట్ లేదు. థాంక్ గాడ్, యోధ కూడా ఆశించిన విజ‌యాల‌ను సాధించ‌లేదు. కానీ ఇప్పుడు బిడ్డొచ్చే వేళ మంచి హిట్టొస్తుంద‌ని ఆశిస్తున్నాడు. అది `వ్యాన్` తో సాధ్య‌మ‌వుతుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. జాన్వీతో ప‌ర‌మ్ సుంద‌రి కూడా సిద్ధార్థ్ కి విజ‌యాన్ని అందించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News