డీజే టిల్లు నుంచి బయటకు వచ్చి చేశాడు..!
అంతేకాదు సిద్ధుకి యూనిక్ పర్ స్పెక్టివ్ ఉంటంది. అది సినిమాకు ఇంకా బెటర్ మెంట్ ఇచ్చిందని అన్నారు.;
సిద్ధు జొన్నలగడ్డ లీడ్ రోల్ లో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించిన సినిమా తెలుసు కద. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమా నిర్మించారు. సినిమాకు థమన్ మ్యూజిక్ అందించగా నీరజన్ కోన ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి మీడియాతో మరిన్ని విశేషాలను పంచుకున్నారు డైరెక్టర్ నీరజ కోన.
కాస్ట్యూమ్ డిజైనర్ నుంచి డైరెక్టర్ గా ఎలా అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. స్కూల్ డేస్ నుంచి రైటింగ్ ఇష్టం ఉంది. పొయెట్రిలో ఒక బుక్ కూడా పబ్లిష్ అయ్యింది. కథలు చెప్పడం ఇష్టం. నాని లాంటి ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు. ఒక టైం లో సినిమా కథ రాస్తాననే నమ్మకం కలిగింది. అలా రాసుకున్న కథల్లో ఒకటి తెలుసు కదా అని అన్నారు నీరజ కోన.
ఏ సినిమాకు అసిస్టెంట్ ఐరెక్టర్ గా పనిచేయలేదు. కానీ వంద సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశాను. 12 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. అదే నా ఎక్స్ పీరియన్స్, లెర్నింగ్ స్కూల్ అని అన్నారు. పులిమేక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నితిన్ కి ఈ ఐడియా చెప్తే సిద్ధుకి బాగుంటుందని అతను చెప్పాడని అన్నారు నీరజ కోన.
సిద్ధు తో కూడా సింగిల్ సిట్టింగ్ లో కథ ఓకే చేశారు. రైటర్ గా డైరెక్టర్ గా తెలుసు కదా తో పరిచయం అవ్వడం సంతోషంగా ఉందని అన్నారు నీరజ కోన.
తెలుసు కదా ఎలా ఉంటుందన్న ప్రశ్నకు సమాధానంగా.. ఇదొక లవ్ స్టోరీ.. ఇద్దరి మధ్య ఉండే ప్రేమకథ. ఒక ప్రేమ కథతో పాటు ఒక కాంప్లెక్సిటీ కూడా ఉంటుంది. క్యారెక్టర్ డ్రైవెన్ స్టోరీ ఇది. సినిమాలో 3 క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ప్రతి రోల్ హానెస్ట్ గా ఉంటుంది. ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుందని అన్నారు నీరజ కోన.
మహిళా దర్సకుల్రాలిగా అమ్మాయిలవైపు బయాస్ ఉంటుందా.. ఎలా డీల్ చేశారు అంటే.. ఒక కథ అమ్మాయి రాసిందా, అబ్బాయి రాశాడా అన్నది కాదు కథని హానెస్ట్ గా చెప్పడం పైనే ఉంటుంది. ఈ కథ ఎలాంటి బయాస్ లేకుండా రాశాను. ఒక గుడ్ ఫిల్మ్ మేకర్ తీసిన సినిమాలా పేరు తెచ్చుకోవడం ఇష్టమని అన్నారు నీరజ కోన.
అంతేకాదు సిద్ధుకి యూనిక్ పర్ స్పెక్టివ్ ఉంటంది. అది సినిమాకు ఇంకా బెటర్ మెంట్ ఇచ్చిందని అన్నారు. సిద్ధు డీజే టిల్లు ఐకానిక్ రోల్ .. ఆ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి చేయడం గొప్ప విషయం. కెరీర్ స్టార్టింగ్ లోనే అలాంటి ఐకానిక్ రోల్ పడటం అదృష్టం. కానీ ఈ సినిమాలో వరుణ్ రోల్ లో యూనిక్ గా ప్రజెంట్ చేశాడు సిద్ధు. ఫిల్మ్ మేకర్ గా ఏమనుకున్నానో అది పర్ఫెక్ట్ గా చేశాడని చెప్పారు నీరజ కోన.
కాస్ట్యూమ్ డిజైనర్ గా తొలి సినిమా బాద్షా. అసిస్టెంట్ గా అత్తారింటికి దారేది, ఎవడు, రామయ్య వస్తావయ్య లాంటి సినిమాలు చేశా. తమిళ్ లో సూర్య, కార్తి, విక్రం, విజయ్ సినిమాలకు కూడా పనిచేసే ఛాన్స్ వచ్చింది. నేనెప్పుడు నేర్చుకునేందుకు ఇష్టపడతా.. ఈ జర్నీలో ఎంతోమంది గ్రేట్ టెక్నిషియన్స్ తో పనిచేశా.. అవన్నీ ఈ సినిమాకు హెల్ప్ అయ్యాయని అన్నారు నీరజ కోన.
ఈ సినిమాలో హీరోయిన్స్ గురించి ఏమన్నారంటే.. శ్రీనిధి చేసిన రాగ రోల్ చాలా కాంప్లెక్స్ ఉన్న క్యారెక్టర్. హిట్ 3 ముందు ఓకే అనుకున్నా కె.జి.ఎఫ్, హిట్ 3 సినిమాలు హెల్ప్ అయ్యేలా చేశాయి. అంజలి రోల్ లో రాశి ఖన్నా అద్భుతంగా చేసిందని అన్నారు నీరజ కోన. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ బ్యాక్ బోన్. అతను ఫ్యామిలీ ఫ్రెండ్. పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. గ్రేట్ ఆల్బం ఇచ్చాడు. బిజిఎం కూడా బ్యూటిఫుల్ గా ఉంటుందని.. థమన్ సపోర్ట్ మర్చిపోలేనని అన్నారు నీరజ కోన.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి చెబుతూ.. విశ్వ ప్రసాద్ గారు లేకపోతే ఈ సినిమా లేదు. కృతి ప్రసాద్ గారు ఈ సినిమాతో చాలా క్లోజ్ అయ్యారు. వారి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఎక్కడ రాజీపడకుండా సినిమా చేశారని అన్నారు నీరజ కోన.