అంతా మన భ్రమ.. పాపం సిద్ధూ.. ఉంహించలేదా?
సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ ప్రమోషన్స్ లో తన టిల్లు స్క్వేర్ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ ఫన్నీ విషయాన్నీ షేర్ చేసుకున్నారు.;
యంగ్ హీరో గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సిద్దు జొన్నలగడ్డ నటించి విడుదలకు సిద్ధంగా ఉన్న తాజా మూవీ తెలుసు కదా.. మరో రెండు రోజుల్లో అంటే అక్టోబర్ 17న థియేటర్లో సందడి చేయబోతున్న తెలుసు కదా మూవీకి సంబంధించి పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తూ ఎలాగైనా సరే ఈసారి హిట్ కొట్టాలని బలంగా ఫిక్స్ అయి ఉన్నారు సిద్దు జొన్నలగడ్డ. ఎందుకంటే ఈ ఏడాది సిద్దు, వైష్ణవి చైతన్య కాంబోలో వచ్చిన జాక్ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడడంతో ఆయన తన ఆశలన్ని నెక్స్ట్ విడుదల కాబోయే తెలుసు కదా మూవీ పైన పెట్టుకున్నారు.. ఇందులో భాగంగానే మూవీకి భారీ ఎత్తున ప్రమోషన్స్ చేస్తూ సినిమాని జనాల్లోకి తీసుకువెళ్తున్నారు. అయితే వరుస ప్రమోషన్స్ చేస్తూ సందడి చేస్తున్న సిద్దు జొన్నలగడ్డ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదంతా భ్రమ.. మనం ఒకటి అనుకుంటే.. అక్కడ ఇంకొకటి జరుగుతుంది అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.మరి సిద్దు జొన్నలగడ్డ ఈ కామెంట్స్ దేని గురించి చేశారు.. ఆయనకు ఏ విషయంలో భ్రమ అనిపించింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ ప్రమోషన్స్ లో తన టిల్లు స్క్వేర్ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ ఫన్నీ విషయాన్నీ షేర్ చేసుకున్నారు. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను టిల్లు స్క్వేర్ సినిమా చేసినప్పుడు,కథ రాసినప్పుడు ఓ రెండు సీన్లకు తెగ నవ్వుకున్నాను. ఆ సీన్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా నవ్వుకున్నాను. అలాగే ఆ సీన్ చేసేటప్పుడు ఎంజాయ్ కూడా చేశాను. నేను ఎంజాయ్ చేసినట్టే ఈ సీన్ చూసేటప్పుడు ప్రేక్షకులు కూడా నవ్వుకుంటారు. ఎంజాయ్ చేస్తారు అనుకున్నాను.కానీ తీరా సినిమా చూసేటప్పుడు మాత్రం రిజల్ట్ మరోలా ఉంది. ఎందుకంటే నేను నవ్వుకున్న ఈ సీన్ కి దేవి థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ఒక్కడు కూడా నవ్వలేదు. అలా నవ్వుకుంటారు అనుకున్న సీన్ కి ఎవరు నవ్వకపోయేసరికి నేనే షాక్ అయ్యాను.దాంతో నాకు నేనే రియలైజ్ అయ్యి కొన్నిసార్లు మనం అనుకున్నవి అన్నీ జరగవు కదా..మనం సినిమా చేసేటప్పుడు అనుకున్నవి స్క్రీన్ పైకి వచ్చాక జరగకపోవచ్చు అని రియలైజ్ అయ్యాను.. అంటూ సిద్దు జొన్నలగడ్డ చెప్పుకొచ్చారు.
సిద్దు జొన్నలగడ్డ మాట్లాడిన మాటలకే చాలామంది నెటిజన్స్ అందరి అభిప్రాయం మీలాగే ఉండదు కదా.. ఎవరి అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయి.. మీకు నవ్వు తెప్పించిన సీన్ మిగతా వారికి నవ్వు తెప్పించాలని లేదు కదా.. ప్రతి ఒక్కరికి వారి వారి సొంత అభిరుచులు, అభిప్రాయాలు అంటూ ఉంటాయి.. మీరు నవ్వుకున్న సీన్ కే వాళ్లు కూడా నవ్వుకోవాలని రూల్ ఏమి లేదు కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.. మరికొంతమంది పాపం సిద్ధూ ఈ విషయాన్ని ఊహించలేదేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు..అలా సిద్దు జొన్నలగడ్డ మాత్రమే కాదు చాలామంది సెలబ్రిటీలు సినిమాలు చేసేటప్పుడు వాళ్లకు కథలు బాగా నచ్చి ఈ సినిమాని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు అని ఒప్పుకొని చేస్తారు. కానీ తీరా సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఇలా స్క్రిప్ట్ బాగా నచ్చి సినిమా చేశాను. కానీ ప్రేక్షకులకు ఆ స్క్రిప్ట్ నచ్చలేదు అన్న సందర్భాలు అనేకం ఉన్నాయి.
ఇక సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ విషయానికి వస్తే.. నీరజ కోన డైరెక్షన్లో టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మాతలుగా చేస్తున్న ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ సరసన రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా మునపటి సినిమాలలా ఉండదని, రీసెంట్ గానే క్లారిటీ ఇచ్చారు. ఇందులో ఒక్క ముద్దు సన్నివేశం కూడా లేదని చెప్పారు. ఇక సిద్దు జొన్నలగడ్డ చేతిలో కోహినూర్ -1, బదాస్ అనే రెండు సినిమాలు కూడా ఉన్నాయి.