కత్తి లేకుండా.. రక్తం కారకుండా.. సిద్ధు సూపర్ స్పీచ్..!
ట్రైలర్ చూసిన తర్వాత ఈసారి సిద్ధు మంచి కంటెంట్ తోనే వస్తున్నాడని అనిపిస్తుంది. ఇక లేటెస్ట్ గా జరిగిన స్పీచ్ తో ఆ విషయం మరింత క్లారిటీ వచ్చేసింది.;
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ లీడ్ రోల్ లో తెరకెక్కిన సినిమా తెలుసు కదా. ఈ సినిమాను నీరజ కోన డైరెక్ట్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించారు. తెలుసు కదా ఇదొక డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. ట్రైలర్ చూసిన తర్వాత ఈసారి సిద్ధు మంచి కంటెంట్ తోనే వస్తున్నాడని అనిపిస్తుంది. ఇక లేటెస్ట్ గా జరిగిన స్పీచ్ తో ఆ విషయం మరింత క్లారిటీ వచ్చేసింది.
ఎమోషనల్ వార్ ఫేర్, సైకలాజికల్ వైలెన్స్..
తెలుసు కదా సినిమా గురించి చెబుతూ గన్ను పట్టకుండా, కత్తి లేకుండా చుక్క రక్తం కారకుండా ఎమోషనల్ వార్ ఫేర్, సైకలాజికల్ వైలెన్స్ ఈ సినిమా అంటూ ఒక భారీ స్టేట్మెంట్ పాస్ చేశాడు సిద్ధు జొన్నలగడ్డ. సినిమా గురించి మొదటి నుంచి సిద్ధు చెబుతున్న మాట ఇదే. అంటే ఏదైనా గాయం తగిలితే రక్తం కారుతుంది.. కొన్నాళ్లకు అది మానిపోతుంది కానీ మనసుకి తగిన గాయానికి రక్తం కనిపించదు కానీ అది ఎప్పటికీ అలానే ఉంటుంది అనేలా సిద్ధు చెప్పాడన్నమాట.
ఇక ఇదే క్రమంలో అమ్మాయిల గురించి చెప్పాడు సిద్ధు జొన్నలగడ్డ. మీకు తెలియదో లేదా తెలిసి కూడా ఇగ్నోర్ చేస్తున్నారో కానీ ఆడవాళ్లు మోస్ట్ బ్యూటిఫుల్ స్పీసెస్ ఎవర్ అన్నాడు సిద్ధు. మీకోసం యుద్ధాలు జరిగాయి, వార్స్ బ్యాటిల్స్ జరిగాయి. మీకోసం పొయెట్రి రాశారు.. హిస్టరీ ప్రూవ్ చేసింది. అసలు సృష్టి మొదలయ్యిందే మీతోటి.. మీ ముందు మేం నిమిత్త మాత్రులం. ఎప్పుడైనా తప్పులు చేసినా పెద్ద మనసుతో క్షమించాలి. ఒక్కసారి చెవి పట్టుకుని తిప్పేస్తే సెట్ అవుతాం.
అమ్మాయి మనసు విరగొట్టి వదిలేస్తే.. వదిలేయండి..
అసలు మీరు గొప్ప మేము గొప్ప అన్నది ఎవరు మొదలు పెట్టింది. మీరే గొప్ప.. మీ వల్ల మేం గొప్ప అని చెప్పాడు సిద్ధు జొన్నలగడ్డ. అంత అందం ఉన్నప్పుడు మేం కూడా ఒకళ్లనే ప్రేమించడం కొంచం కష్టమని అన్నాడు సిద్ధు. ఇక అమ్మాయి మనసు విరగొట్టి వదిలేస్తే.. వదిలేయండి. లేదు అలా కాదు అని మీరు వెంట పడ్డారో.. ఎంత వెంట పడారో మీకు మీదున్న మర్యాద పోతుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ నాన్ నెగుషబుల్.. అది అక్కడ ఉండాలి.. ఆ తర్వాత బాధేస్తుంది.. ఏడుస్తాం. ఎందుకురా ఇలా అయిపోయాం అనిపిస్తుంది.. రానివ్వండి పర్లేదు.. అప్పుడు అసలు కథ మొదలవ్ అవుతుంది.
అప్పుడు మీ లో నుంచి ఒకడు బయటకు వస్తాడు వరుణ్ లాంటోడు.. అప్పుడు మీకు అర్ధం అవుతుంది.. మన ఎమోషన్స్ ఎప్పుడు మన కంట్రోల్ లో ఉండాలని.. పవర్ సెంటర్ ఎప్పుడు మన దగ్గరే మెయింటైన్ అవ్వాలి.. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే తెలుసు కదా సినిమా చూసేయండి అని అన్నాడు సిద్ధు జొన్నలగడ్డ. సిద్ధు తెలుసు కదా సినిమాలో ఉన్న మ్యాజిక్ ఏంటో శాంపిల్ తన స్పీచ్ లోనే చూపించాడు. అతను ఏ సినిమాకు ఇంత క్రేజీ స్పీచ్ ఇవ్వలేదు. ముఖ్యంగా అమ్మాయిలు, అబ్బాయిలు అంటూ చాలా బాగా మాట్లాడాడు.