సారా- శుభ్ మాన్.. ఏదో జరుగుతోంది.. ఇదిగో ప్రూఫ్
ప్రేయసి ప్రియులు ఒకరికొకరు ఎదురు పడితే ఆ సన్నివేశం ఎలా ఉంటుందో ఊహించగలం. ఇప్పుడు అలాంటి ఒక సన్నివేశం బయటపడింది.;
ప్రేయసి ప్రియులు ఒకరికొకరు ఎదురు పడితే ఆ సన్నివేశం ఎలా ఉంటుందో ఊహించగలం. ఇప్పుడు అలాంటి ఒక సన్నివేశం బయటపడింది. అది కూడా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్, ట్యాలెంటెడ్ యువ ఆటగాడు శుభ్ మాన్ గిల్ నడుమ ఈ రొమాంటిక్ దృశ్యం నిజమైన సంచలనంగా మారింది.
ఇది ఫేక్ కాదు.. పక్కాగా నిజం. సారా టెండూల్కర్- శుభ్ మాన్ ఒకరినొకరు చూసుకుంటూ, సిగ్గులొలకబోస్తూ, నవ్వులు చిందిస్తూ, ఆ దృశ్యం వీక్షించేందుకు ఎంతో రోమాంచితంగా కనిపించింది. ఆసక్తికరంగా ప్రేయసి ప్రియులను డిస్ట్రబ్ చేసేందుకే ఉన్నారా? అన్నట్టుగా, అక్కడ సచిన్ టెండూల్కర్, రవీంద్ర జడేజా కూడా ఉన్నారు.
సారా టెండూల్కర్ ని కొంత దూరం నుంచి వీక్షిస్తున్న శుభ్ మాన్‌ని ఏడిపిస్తూ కనిపించాడు జడేజా. ఇదంతా సిగ్గేనా? అంటూ శుభ్‌మాన్ ని అతడు ఆట పట్టిస్తున్నాడు. ఆ సమయంలో తండ్రి సచిన్ టెండూల్కర్ తన పక్కనే ఉన్నా కానీ అతడిని ఖాతరు చేయకుండా సారా టెండూల్కర్ తథేకంగా శుభ్ మాన్ నే వీక్షిస్తూ కనిపించింది. ఇదంతా వీక్షకులకు చాలా రొమాంటిగ్గా కనిపించింది. శుభ్ మాన్ ఎక్కడా కనులారప్పకుండా సారానే చూస్తూ కనిపించాడు. ఇక ఆ సమయంలో సారాను డిస్ట్రబ్ చేస్తూ సచిన్ ఆ ఇద్దరి మధ్యకు వచ్చాడు. కుమార్తెతో ఏదో మాట్లాడుతూ నవ్వుతూ కనిపించాడు. ఇక సారా ఇటువైపు నుంచి కనులు తిప్పుకోలేని దృశ్యం వాస్తవ పరిస్థితికి అద్దం పట్టింది. కచ్ఛితంగా ఆ ఇద్దరి మధ్యా ఏదో జరుగుతోందనడానికి ఇది ఒక నిదర్శనం. లండన్ లోని ఓ స్పెషల్ పార్టీ ఇందుకు వేదిక అయింది.