చీరకట్టులో దేవకన్యను తలపిస్తున్న శృతిహాసన్.. ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిందా?
అందాల తార.. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా చలామణి అవుతున్న సెలబ్రిటీ కిడ్ శృతిహాసన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.;
అందాల తార.. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా చలామణి అవుతున్న సెలబ్రిటీ కిడ్ శృతిహాసన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ఊహించని క్రేజ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. సింగర్ గా తన ప్రయాణాన్ని ఇండస్ట్రీలో మొదలుపెట్టింది. తన అద్భుతమైన గాత్రంతో శ్రోతలను అలరించిన శృతిహాసన్ ఆ తర్వాత హీరోయిన్ గా అవతరించిన విషయం తెలిసిందే ..ముఖ్యంగా 3 సినిమాతో యువతలో క్రష్ గా మారిన శృతిహాసన్... తెలుగులో తొలిసారి అనగనగా ఓ ధీరుడు సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.. చేసింది మొదటి సినిమానే అయినా అందరి దృష్టిని ఆకట్టుకుంది కానీ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ఆ తర్వాత ఓ మై ఫ్రెండ్ సినిమా చేసింది. ఇది కూడా డిజాస్టర్ గానే మిగిలింది. ఇక దీంతో ఈమె ఐరన్ లెగ్ అని అవకాశాలు లభించడం కష్టమే అనే కామెంట్లు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో సడన్గా హరీష్ శంకర్ రూపంలో ఈమెకు ఊహించని ఘనవిజయం లభించింది..పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ గబ్బర్ సింగ్ సినిమా సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా అటు పవన్ కళ్యాణ్ కు ఇటు శృతిహాసన్ కి మంచి కెరియర్ ని అందించింది. ఆ తర్వాత బలుపు, రామయ్య వస్తావయ్య, ఎవడు , రేసుగుర్రం, ఆగడు, శ్రీమంతుడు అంటూ వరుస సినిమాలతో దూసుకుపోయింది ఈ ముద్దుగుమ్మ.
2017 లో వచ్చిన కాటమరాయుడు సినిమా తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చిన శృతిహాసన్.. 2021 లో క్రాక్ సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. వకీల్ సాబ్ , వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, హాయ్ నాన్న, సలార్ చిత్రాలతో పాన్ ఇండియా స్టేటస్ ను దక్కించుకుంది. ఇకపోతే ప్రస్తుతం తమిళ్ చిత్రాలతో బిజీగా గడిపేస్తున్న శృతిహాసన్.. మరొకవైపు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసింది. తాజాగా పింక్ కలర్ చీర కట్టి నడుము అందాలను హైలెట్ చేస్తూ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సింపుల్ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి నుదుటిన తిలకం దిద్ది తన అందాలతో మరొకసారి ఆకట్టుకుంది.
ఇకపోతే సడన్ గా శృతిహాసన్ పింక్ కలర్ చీర కట్టుకొని అందాలు ఆరబోయడంతో ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు బ్లాక్ సెంటిమెంట్ కి శృతిహాసన్ బ్రేక్ చెప్పిందా అనే కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. శృతిహాసన్ ఇంస్టా పేజ్ ను కనుక గమనిస్తే.. ఎక్కువగా ఆమె బ్లాక్ అవుట్ ఫిట్ లోనే దర్శనమిస్తుంది. ఈ బ్లాక్ ధరించడం వల్ల తనకు సెంటిమెంట్ మాత్రమే కాదు.. తనలో సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెరుగుతుందని, తన స్కిన్ టౌన్ మెరుగుపడుతుంది అని కూడా గతంలో తెలిపింది
అయితే ఇప్పుడు పింక్ చీర కట్టడంతో ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసిందా? ఇప్పుడు పింక్ చీరలో కూడా అంతకుమించి అందంగా ఉందే అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు . మరికొంతమంది ఎలాంటి రంగు చీర కట్టినా ఆ చీరకే అందం వస్తుందని కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.