పిక్‌టాక్ : స్విమ్మింగ్ పూల్‌లో అందాల శ్రియ
టాలీవుడ్‌లో ఇష్టం సినిమాతో అడుగు పెట్టిన శ్రియ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంది. తెలుగు స్టార్ హీరోల్లో దాదాపు అందరితోనూ నటించి మెప్పించిన శ్రియ ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది.;
టాలీవుడ్‌లో ఇష్టం సినిమాతో అడుగు పెట్టిన శ్రియ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంది. తెలుగు స్టార్ హీరోల్లో దాదాపు అందరితోనూ నటించి మెప్పించిన శ్రియ ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. ఈ ఏడాదిలో రెట్రో, మిరాయ్ సినిమాలతో వచ్చిన శ్రియ ఆకట్టుకుంది. ముఖ్యంగా మిరాయ్ సినిమాలో హీరో తేజ కి సమానమైన పాత్ర అంటూ ప్రశంసలు దక్కించుకుంది. శ్రియను చాలా విభిన్నంగా చూశామని ఆమె ఫ్యాన్స్‌తో పాటు అంతా కూడా ప్రశంసలు కురిపించారు. మిరాయ్ సినిమాలో తల్లి పాత్రలో కనిపించడంతో పాటు, ఒక సీరియస్ పాత్రను పోషించడం ద్వారా శ్రియ అందరి దృష్టిని ఆకర్షించింది. అలాంటి పాత్రలను శ్రియ మరిన్ని చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. పెళ్లి అయ్యి తల్లి అయిన తర్వాత కూడా శ్రియ ఫుల్ స్వింగ్‌లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉండటం విశేషం.
శ్రియకి ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫాలోయింగ్
సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలోనూ శ్రియా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. దాదాపుగా 5 మిలియన్‌ల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న శ్రియ రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా సోషల్ మీడియా ద్వారా తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేయడం మనం చూస్తూ ఉంటాం. పాపతో కలిసి శ్రియ రెగ్యులర్‌గా టూర్స్‌కి వెళ్లడం, అక్కడ తీసుకున్న ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఫ్యామిలీతో కలిసి శ్రియ శ్రీలంక వెళ్లింది. అక్కడ సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. శ్రియ కూతురు అప్పుడే ఇంత పెద్దగా అయిందా అంటూ చాలా మంది కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇదే సమయంలో శ్రియ అందం గురించి ప్రముఖంగా కామెంట్స్ చేస్తున్నారు.
స్విమ్మింగ్ పూల్‌లో అందాల శ్రియ
శ్రియ అందాల ఆరబోత ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్ కావడం మనం చూస్తూనే ఉన్నాం. ఈసారి కూడా స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న శ్రియ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆకట్టుకునే విధంగా ఉన్న శ్రియ ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్‌లో బికినీ ధరించిన ఈ అమ్మడు పాప, భర్తతో స్విమ్మింగ్ పూల్‌లో సరదాగా ఆటలాడుకుంటూ కనిపించింది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ శ్రియ ఇలా ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపడటం మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఫ్యామిలీ ఫోటోలకు కూడా ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వస్తూ ఉంటుంది. అందుకు కారణం ఇలాంటి ఫోటోల్లో కూడా శ్రియ తన అందాల ఆరబోత చేయడం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ శ్రియ బికినీతో కనిపించడంతో ఫ్యాన్స్ మాత్రమే కాకుండా నెటిజన్స్ చూపు తిప్పలేక పోతున్నారు.
చిరంజీవి, బాలకృష్ణలతో...
డాన్సర్ కావాలని కోరుకున్న శ్రియ అనూహ్యంగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. 2001లో ఇష్టం సినిమాతో తెలుగు సినిమాల్లో అడుగు పెట్టిన శ్రియ తదుపరి ఏడాదిలో వచ్చిన సంతోషం సినిమాతో స్టార్ హీరోయిన్‌గా నిలిచింది. నాగార్జునతో కలిసి చేసిన నేనున్నాను, ప్రభాస్‌తో కలిసి చేసిన చత్రపతి, రజనీకాంత్‌తో చేసిన శివాజీ, చిరంజీవితో చేసిన ఠాగూర్, బాలకృష్ణతో చేసిన చెన్నకేశవ రెడ్డి ఇలా అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేయడం ద్వారా టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్‌గా నిలిచింది. అంతే కాకుండా సౌత్‌లోని అన్ని భాషల్లో ఈమె నటించడం జరిగింది. బాలీవుడ్‌లో కెరీర్ ఆరంభం నుంచి అప్పుడప్పుడు సినిమాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియాలో సందడి చేస్తూనే వచ్చిన ప్రతి ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుంటూ ఉంది. నలబైలోనూ ఇరవై మాదిరిగా అందంగా ఉన్న శ్రియ మరిన్ని సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.