గుమ్మడి నర్సయ్య బయోపిక్.. ముహూర్తం రోజే మాట ఇచ్చిన శివన్న..!
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ లీడ్ రోల్ లో ప్రజా నాయకుడు గుమ్మడి నర్సయ్య బయోపిక్ గా ఆయన పేరునే టైటిల్ గా ఒక సినిమా వస్తుంది.;
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ లీడ్ రోల్ లో ప్రజా నాయకుడు గుమ్మడి నర్సయ్య బయోపిక్ గా ఆయన పేరునే టైటిల్ గా ఒక సినిమా వస్తుంది. పరమేశ్వర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎన్.సురేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈవెంట్ లో శివ రాజ్ కుమార్ స్పీచ్ తెలుగు ఆడియన్స్ ని మెప్పించింది. మంచి మనిషి జీవిత చరిత్రలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు శివ రాజ్ కుమార్. మా నాన్న గారు మనం మన కోసం కాదు ఇతరుల కోసం బ్రతకాలని అంటుంటారు. అదే పద్ధతి నేను కూడా ఫాలో అవుతున్నా.
ప్రజల కోసమే జీవితాన్ని అంకితం..
గుమ్మడి నర్సయ్య గారిని చూస్తే ఆయన కూడా ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేశారు. గుమ్మడి నర్సయ్య ఇంటికి వెళ్లి చూస్తే నాకు మా ఇల్లు గుర్తొచ్చిందని అన్నారు శివ రాజ్ కుమార్. గుమ్మడి నర్సయ్యని కలిస్తే సొంత మనుషులను కలిసినట్టు అనిపించింది. ఇది ఆయన బయోపిక్ చేస్తున్నా కాబట్టి చెప్పడం కాదు నిజంగానే మనసుకి చాలా దగ్గరైన మనిషిగా అనిపించారు గుమ్మడి నర్సయ్య. ఆయన్ను చూస్తుంటే మా నాన్నను చూసినట్టే ఉందని అన్నారు శివ రాజ్ కుమార్.
స్పీచ్ ని తెలుగులో కొనసాగించాలని ప్రయత్నించిన శివ రాజ్ కుమార్ మీరు ఏమి అనుకోవద్దు నెక్స్ట్ టైం కి తెలుగు బాగా మాట్లాడతాను. ఈ సినిమానే తెలుగు నేనే డబ్బింగ్ చెబుతా అని అన్నారు శివ రాజ్ కుమార్. గుమ్మడి నర్సయ్య సినిమా ఎంతోమంది స్పూర్తి నింపుతుంది. యువత రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి ఈ మూవీ చూడాలని అన్నారు శివ రాజ్ కుమార్.
పెద్దల పట్ల శివ రాజ్ కుమార్ అభిమానం..
వేదిక మీద గుమ్మడి నర్సయ్యని తన తండ్రి సమానులుగా చెబుతూ ఆయన కాళ్లకు నమస్కరించారు శివ రాజ్ కుమార్. కన్నడలో సూపర్ స్టార్ అయినా కూడా పెద్దల పట్ల ఆయనకున్న అభిమానం ముఖ్యంతా ఆయన జీవితాన్ని సినిమాగా చేస్తూ గుమ్మడి నర్సయ్య ఆశీర్వాదం తీసుకోవడం ప్రజలను ఆకట్టుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గుమ్మడి నర్సయ్య సినిమా పూజా కార్యమ్రాలు జరిగాయి. ఈ వేడుకకు తెలంగాణా మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కూనేని సాంబశివరావు, తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థానిక ప్రముఖులు అటెండ్ అయ్యారు.
ప్రజల మనిషి గుమ్మడి నర్సయ్య బయోపిక్ ని పరమేశ్వర్ డైరెక్ట్ చేస్తుండగా ప్రవళ్లిక బ్యానర్ లో ఎన్ సురేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. గుమ్మడి నర్సయ్య కథ దేశం మొత్తం చూడాలని ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.