కన్నడ-తమిళ వివాదం పీక్స్.. కమల్ హాసన్ బోల్డ్ స్టేట్‌మెంట్.. శివరాజ్ కుమార్‌పై విమర్శల వెల్లువ!
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా, త్రిష, అభిరామి హీరోయిన్లుగా లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం 'థగ్ లైఫ్'.;
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా, త్రిష, అభిరామి హీరోయిన్లుగా లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం 'థగ్ లైఫ్'. ఈ సినిమా రిలీజ్‌కు దగ్గర పడుతున్న సమయంలోనే ఊహించని విధంగా అనేక వివాదాలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా కమల్ హాసన్ చేసిన ఓ వ్యాఖ్య కన్నడ, తమిళ భాషల మధ్య తీవ్ర వివాదానికి దారి తీసింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది
కమల్ హాసన్ ఇటీవల ఒక సందర్భంలో మాట్లాడుతూ.. "కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది" అని చేసిన వ్యాఖ్య పెద్ద ఎత్తున వివాదానికి దారి తీసింది. కన్నడ అభిమానులు, భాషాభిమానులు ఈ వ్యాఖ్యపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కన్నడ భాషకు ప్రత్యేక చరిత్ర, గుర్తింపు ఉందని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు తీవ్రంగా విమర్శించారు. కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
క్షమాపణ చెప్పనన్న కమల్
విమర్శలు వెల్లువెత్తినా కమల్ హాసన్ తన వైఖరిని మార్చుకోలేదు. ఆయన మరింత బోల్డ్‌గా స్పందిస్తూ.. "నేను అన్న దాంట్లో ఎలాంటి తప్పు లేదు. నేను క్షమాపణ చెప్పేది లేదు. నన్ను కన్నడలో బ్యాన్ చేసినా సరే, నేను తప్పు చేస్తే తప్ప ఖచ్చితంగా క్షమాపణ చెప్తాను" అని మళ్లీ సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు మరింత వైరల్‌గా మారాయి. కమల్ హాసన్ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండడం, క్షమాపణ చెప్పడానికి నిరాకరించడం కన్నడ ప్రేక్షకులలో ఆగ్రహాన్ని మరింత పెంచింది.
శివరాజ్ కుమార్‌పై విమర్శలు
ఈ వివాదం మధ్య, 'థగ్ లైఫ్' సినిమా ఈవెంట్‌కు కన్నడ నటుడు శివరాజ్ కుమార్ హాజరుకావడం, అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత షాకింగ్‌గా మారాయి. శివరాజ్ కుమార్, కమల్ హాసన్‌ను తన తండ్రి సమానులు అని ప్రశంసించడంతో పాటు.. "కన్నడ ప్రేక్షకులారా, మీరు నాన్-కన్నడ సినిమాలు చూడట్లేదా?" అంటూ ప్రశ్నించినట్లు వార్తలు వచ్చాయి.
శివరాజ్ కుమార్ వ్యాఖ్యలపై కన్నడ ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "అంటే మీరు కన్నడ ప్రేక్షకులను అవమానిస్తున్నారా? మమ్మల్ని తప్పు పడుతున్నారా?" అంటూ శివరాజ్ కుమార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సొంత భాషాభిమానులనే తప్పు పట్టేలా శివరాజ్ కుమార్ మాట్లాడడం ఆయన అభిమానులనే కలవరపరిచింది. దీంతో ఈ అంశం మరింత రసవత్తరంగా మారింది.
వివాదాల నడుమ 'థగ్ లైఫ్' రిలీజ్
కమల్ హాసన్ వ్యాఖ్యలు, శివరాజ్ కుమార్ స్పందన, కన్నడ అభిమానుల ఆగ్రహం – ఇలా వరుస వివాదాల నడుమ 'థగ్ లైఫ్' సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ భాషా వివాదం సినిమా వసూళ్లపై ఏమైనా ప్రభావం చూపుతుందా అనేది వేచి చూడాలి. రిలీజ్ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో, ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.