బీస్ట్ మోడ్ లో శివాత్మిక
బ్లాక్ షార్ట్, బ్లాక్ కలర్ ఫుల్ స్లీవ్స్ టీ షర్ట్ వేసుకుని శివాత్మిక జిమ్ వీడియోను పోస్ట్ చేస్తూ దానికి ప్రెట్టీ లిటిల్ జిమ్ మర్డర్ అనే క్యాప్షన్ ను రాసుకొచ్చింది.;
హీరోయిన్ అంటే ఎవరైనా సరే తప్పనిసరిగా ఫిట్‌నెస్ మెయిన్‌టెయిన్ చేయాల్సిందే. ప్రస్తుతం సినిమాల్లేవు కదా అని ఇష్టమొచ్చినట్టు తిని కూర్చోడానికి లేదు. అందుకే హీరోయిన్లు ప్రతీరోజూ జిమ్ చేస్తూ తమ బాడీని ఫిట్ గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. టాలీవుడ్ లో ఎంతోమంది ఫిట్‌నెస్ ఫ్రీక్స్ ఉండగా ఇప్పుడు ఆ లిస్ట్ లోకి యాంగ్రీ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక కూడా చేరింది.
ఆనంద్ దేవరకొండతో కలిసి దొరసాని సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన శివాత్మిక రాజశేఖర్ చివరిగా రంగ మార్తాండలో కనిపించింది. ఆ సినిమా తర్వాత శివాత్మిక మరో సినిమాను అనౌన్స్ చేసింది లేదు. అయితే శివాత్మిక సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉన్నప్పటికీ సినీ ఇండస్ట్రీకి మాత్రం దూరం కాలేదు. తాజాగా శివాత్మిక షేర్ చేసిన జిమ్ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
బ్లాక్ షార్ట్, బ్లాక్ కలర్ ఫుల్ స్లీవ్స్ టీ షర్ట్ వేసుకుని శివాత్మిక జిమ్ వీడియోను పోస్ట్ చేస్తూ దానికి ప్రెట్టీ లిటిల్ జిమ్ మర్డర్ అనే క్యాప్షన్ ను రాసుకొచ్చింది. ఈ వీడియోలో శివాత్మిక బీస్ట్ మోడ్ లో బరువులతో స్వ్కాట్స్ చేయడం పెద్ద విషయమేమీ కాదన్నట్టు చేసి అందరినీ ఆకర్షించింది. వీడియోలో శివాత్మిక ఎనర్జీ, తన ఫోకస్ అందరినీ తన వైపు తిప్పుకునేలా చేస్తున్నాయి.
దాంతో పాటూ లెగ్ మెషీన్ తో మరో క్లిప్ ను కూడా శివాత్మిక దానికి జోడించి జిమ్ లో తను పడే కష్టాన్ని అందరికీ తెలిసేలా చేసింది. అయితే శివాత్మిక జిమ్ వీడియో మనం రెగ్యులర్ గా చూసే బాలీవుడ్ భామల జిమ్ వీడియోలా లేదు. ఈ వీడియోలో శివాత్మిక ఎలాంటి మేకప్, గ్లామరస్ లుక్ లో కాకుండా పూర్తిగా చెమటలతో కనిపిస్తూ తన పోస్ట్ ను మరింత స్పెషల్ గా మార్చింది.