అదృష్టం అంటే ఈ తెలుగమ్మాయిదే!
కొందరికి సినిమా అవకాశాలు అన్నవి అనుకోకుండా వస్తాయి. కెరీర్ ప్లానింగ్ లో సినిమా లేకపోయినా? అనూహ్యంగా వచ్చిన అవకాశాలతో ఈ రంగంలో స్థిరపడిన వారు చాలా మంది ఉన్నారు.;
కొందరికి సినిమా అవకాశాలు అన్నవి అనుకోకుండా వస్తాయి. కెరీర్ ప్లానింగ్ లో సినిమా లేకపోయినా? అనూహ్యంగా వచ్చిన అవకాశాలతో ఈ రంగంలో స్థిరపడిన వారు చాలా మంది ఉన్నారు. నటుడు రాహుల్ రామకృష్ణ ఇండస్ట్రీలో ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే సక్సెస్ అయ్యాడు. టాలీవుడ్ లో స్థిరపడ్డాడు. `అర్జున్ రెడ్డి` చిత్రం అతడి జీవితాన్నే మార్చేసింది. ఇంకా ఇలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. తెలుగు అమ్మాయి శివానీ నాగరం కడూఆ అలాగే క్లిక్ అయినట్లు తెలిపింది. శివానీ సినిమాల్లోకి రావాలని ముందెప్పుడు అనుకోలేదంది.
ఓ షార్ట్ ఫిల్మ్ కోసం తొలిసారి కెమెరా ముందుకొచ్చింది. ఆ గుర్తింపు తోనే సినిమా అనే థాట్ మనసులో మొదలింది. అటుపై `అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్` లో ఛాన్స్ అందుకుంది. ఆ చిత్ర దర్శక, నిర్మాతలు యూ ట్యూబ్ లో చూసి అమ్మడిని అప్రోచ్ అవ్వడం..పాత్రకు సెట్ అవుతుందని భావించి ఎంపిక చేసారు. తొలి సినిమా షూటింగ్ సమయం లో చాలా టెన్షన్ పడింది. కానీ ఇప్పుడా టెన్షన్ పోయి నటిగా ధైర్యంగా పని చేస్తోంది. ఆ తర్వాత నటించిన `లిటిల్ హార్స్ట్` కూడా మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం కొత్త అవకాశాలు బాగానే వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కాలమే తనని స్టార్ గా మార్చిందని..తనని తాను ఎప్పుడూ అలా ఊహించుకోలేదంది శివానీ.
తాను నటిని అయినా బ్యూటీ విషయంలో చాలా సింపుల్ గా ఉంటానంది. చర్మ సంరక్షణ కోసం క్రీమలు వాటికి దూరంగా ఉంటానంది. వీలైనంత వరకూ నేచురల్ గా కనిపించడానికి ఇష్టపడతానంది. శరీరానికి కావాల్సినన్నీ నీళ్లు మాత్రం క్రమం తప్పకుండా తాగుతానంది. రాత్రి సమయంలో మాత్రం మాయిశ్చరైజర్ తప్పనిసరిగా వాడుతానంది. వారానికి ఒకసారి చర్మానికి పెసరడిండి మాత్రం రాస్తానంది.
ఇక టాలీవుడ్ లో నటీమణుల మధ్య ఎలాంటి కాంపిటీషన్ ఉందన్నది తెలిసిందే. ఒక్క ఛాన్స్ కోసం ఎంతో మంది క్యూలో ఉన్నారు. స్థానిక భామలతో పాటు ముంబై, చెన్నై, కేరళ, బెంగుళూరు ప్రాంతాల నుంచి దిగుమతి అవుతోన్న వారి సంఖ్య అంతకంతకు కనిపిస్తోంది. సాధారణంగా తెలుగు హీరోయిన్లకు అవకాశాలివ్వడానికి దర్శక, నిర్మాతలు కూడా ముందుకు రారు. స్థానిక నటులతో కొన్ని రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయని భయం కూడా ఓ కారణం. వాటన్నింటిని బ్రేక్ చేసి శివానీ ఛాన్సులు అందుకుంటుంది. ఇంత వరకూ గ్లామర్ పాత్రల్లో నటించలేదు. మరి ఆ తరహా పాత్రల విషయంలో శివానీ ఎలా స్పందిస్తుందో చూడాలి.