• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శివంభజే ట్రైలర్… పవర్...

శివంభజే ట్రైలర్… పవర్ ఫుల్ యాక్షన్

| అప్సర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గంగ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మహేశ్వర్ రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మించారు.

By - Tupaki Desk
Update: 2024-07-23 09:23 GMT

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో దర్శకులు, హీరోలు అందరూ కూడా దైవంతో కనెక్ట్ అయ్యి ఉండే కథలని తెరపై ఆవిష్కరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దైవం అనే ఎలిమెంట్ సెంటిమెంట్ గా వర్క్ అవుట్ అవుతోంది. అలాగే కంటెంట్ లో పవర్ ఫుల్ గా ప్రేక్షకులకి గూస్ బాంబ్స్ క్రియేట్ చేసే ఎలివేషన్ తో రిప్రజెంట్ చేయొచ్చు. ప్రేక్షకులు కూడా ఎమోషనల్ గా సూపర్ నేచురల్ కాన్ ఫ్లిక్ట్స్ కి కనెక్ట్ అవుతున్నారు. ఈ దారిలోనే శివుడితో కనెక్ట్ అయ్యి ఉండే కాన్సెప్ట్ తో అశ్విన్ బాబు హీరోగా శివంభజే సినిమా తెరకెక్కింది.

అప్సర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గంగ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మహేశ్వర్ రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ బడ్జెట్ తో యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో శివంభజే మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, పవర్ ఫుల్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ మూవీ ఉండబోతోందని ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది.

ఈ ట్రైలర్ ఆరంభంలో పాకిస్థాన్ ఇండియాలో ఏదో పెద్ద విధ్వంసానికి కుట్ర చేస్తున్నట్లుగా డైలాగ్స్ తో ప్రెజెంట్ చేశారు. తరువాత హీరో అశ్విన్ బాబుని యాక్షన్ సీక్వెన్స్ తో పరిచయం చేశారు. తరువాత సిటీలో జరిగే మిస్టీరియస్ క్రైమ్స్ మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినట్లు చూపించారు. ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉండగానే అశ్విన్ బాబు మీద ఎవరో ఎటాక్ చేసే విజువల్ వేశారు. తరువాత హీరో తల్లి శివుడిని ప్రార్ధించడం. అఘోర క్యారెక్టర్ తో శివశక్తి కథలోకి ఇంటర్ అయినట్లు ఎలివేట్ చేశారు.

ఆ పై సిటీలో జరుగుతున్న క్రైమ్స్, వాటి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరనేది హీరో కనిపెట్టే ప్రయత్నం మొదలుపెడతాడు. ఇందులో భాగంగా పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్, ఫెస్టివల్ బ్యాక్ డ్రాప్ లో ఫైట్ సీన్స్ తో గూస్ బాంబ్స్ క్రియేట్ చేసే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ట్రైలర్ ని పవర్ ప్యాక్డ్ గా ప్రెజెంట్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే కంటెంట్ తో ఇంటెస్టింగ్ కథని దర్శకుడు అప్సర్ చెప్పినట్లు కనిపిస్తోంది.

ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే యాక్షన్ ఎపిసోడ్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కథలో పుష్కలంగా ఉన్నాయని అనిపిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ అర్బాజ్ ఖాన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. ఆయన పాత్రలో సినిమాలో కీలకంగా ఉండబోతోందని తెలుస్తోంది. అలాగే దిగంగాన సూర్యవంశీ హీరోయిన్ గా నటించింది. మురళీ శర్మ కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కనిపించాడు. ఈ సినిమాకి వికాస్ బడిస మ్యూజిక్ అందిస్తున్నారు. ఆగష్టు 1న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు ట్రైలర్ తో రివీల్ చేశారు. శివంభజే ట్రైలర్ చూస్తుంటే ఈ సారి అశ్విన్ బాబు మంచి సక్సెస్ కొట్టేలా ఉన్నాడని సినీ విశ్లేషకులు అంటున్నారు. నెటిజన్లు నుంచి ట్రైలర్ కి మంచి స్పందన వస్తోంది.

Full View
Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • ShivamBhaje 
  • Trailer 
  • AshwinBabu 
  • ArbaazKhan 
  • DiganganaSuryavanshi 
  • HyperAadi 
  • MuraliSharma 
  • SaiDheena 
  • Apsar 
  • MaheswaraReddyMooli 
  • GangaEntertainments 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS