ట్రైలర్: మురగదాస్ మధరాసి.. శివకార్తికేయన్ వైల్డ్ డోస్!
ఇప్పటికే విడుదలైన టీజర్‌తోనే సినిమాపై బజ్ పెరిగిపోయింది. మాస్, క్లాస్ మిక్స్‌తో మురగదాస్ ఈసారి కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నారని అప్పుడే క్లారిటీ వచ్చింది.;
కొన్ని సినిమాలు స్టార్ హీరోల కెరీర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్తాయి. తమిళంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న శివకార్తికేయన్‌కి మధరాసి అలాంటి అవకాశమేనని అభిమానులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈసారి ఆయన్ను డైరెక్ట్ చేస్తున్నది గజిని, తుపాకీ, కథ్తి లాంటి బ్లాక్‌బస్టర్లను ఇచ్చిన ఏఆర్ మురగదాస్ కావడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఇప్పటికే విడుదలైన టీజర్‌తోనే సినిమాపై బజ్ పెరిగిపోయింది. మాస్, క్లాస్ మిక్స్‌తో మురగదాస్ ఈసారి కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నారని అప్పుడే క్లారిటీ వచ్చింది. ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ మాత్రం ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఇంకో రేంజ్‌కి తీసుకెళ్లింది.
ట్రైలర్ స్టార్ట్ లో హీరో జీవితం ఒక యాక్సిడెంట్ తరువాత పూర్తిగా మారిపోతుంది. ఆ సంఘటనతో అతని బ్రెయిన్ ఒక్క విషయంపైనే ఫిక్స్ అయి దానిని సాధించేందుకు ఏదైనా చేయగలననే మైండ్‌సెట్‌లోకి వెళ్తుంది. ఈ పాయింట్ చుట్టూ కథ తిరుగుతూ, యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పటిష్టంగా కొనసాగనుందని ట్రైలర్ సూచించింది. అలాగే గన్ మాఫియాను ఎదుర్కొనే సైనికుడిగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.
రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెతో శివకార్తికేయన్ కెమిస్ట్రీ బాగుంది. రొమాంటిక్ ట్రాక్ కూడా ఆకట్టుకునేలా మెలోడీ సాంగ్స్‌తో కలిపి చూపించారు. అనిరుధ్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కి బూస్ట్ ఇచ్చింది. యాక్షన్ బ్లాస్టింగ్ విజువల్స్‌తో పాటు శివకార్తికేయన్ ఎనర్జీ స్క్రీన్‌పై హైలైట్‌గా నిలిచింది.
ట్రైలర్‌లో మురగదాస్ స్టైల్ డైరెక్షన్ స్పష్టంగా కనిపించింది. స్లీక్ ఫ్రేమ్స్, ఫాస్ట్ పేస్ నేరేషన్, యాక్షన్ హై వోల్టేజ్ పిక్చరైజేషన్‌తో ఆయన మళ్లీ తన ముద్ర వేసేలా ఉన్నాడు. ఇదే ఆయన కెరీర్‌లో పెద్ద కంబ్యాక్ మూవీ అవుతుందని ఇప్పటికే టాక్ వినిపిస్తోంది.
భారీ బడ్జెట్‌తో శ్రీలక్ష్మి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మాస్, క్లాస్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ట్రైలర్ డిజైన్ చేయబడింది. మొత్తానికి మధరాసి ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ఈ సినిమా డెఫినిట్ బ్లాక్‌బస్టర్ అవుతుందనే నమ్మకాన్ని పెంచింది.