మురగదాస్ - శివకార్తికేయన్ మదరాసి.. రిలీజ్ డేట్ వచ్చేసింది
మేకర్స్ తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో సెప్టెంబర్ 5న థియేటర్లలో అనే ప్రకటనను క్లియర్‌గా వెల్లడించారు.;
గత కొంత కాలంగా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శివకార్తికేయన్ ఈసారి డైరెక్ట్ మాస్ అటాక్స్‌కు సిద్ధమవుతున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న శివకార్తికేయన్.. ఇప్పుడు టాప్ మాస్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్‌తో కలిసి అడుగుపెడుతున్న మాస్ యాక్షన్ డ్రామా “మదరాసి” పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మొదటి నుంచి ఈ మూవీ గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొనగా.. ఇటీవల విడుదల చేసిన పోస్టర్లు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ రిలీజ్ డేట్ కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. మేకర్స్ తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో సెప్టెంబర్ 5న థియేటర్లలో అనే ప్రకటనను క్లియర్‌గా వెల్లడించారు.
దీనితో మదరాసి థియేట్రికల్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టే. మాస్ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని, వండర్‌ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు పోస్టర్లు చెబుతున్నాయి. ఇక పోస్టర్‌లో శివకార్తికేయన్ ఒక మాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. కళ్లలో రెడ్‌నెస్, వెనుకభాగంలో భారీ పేలుళ్లు, కారు యాక్షన్ సీక్వెన్స్‌తో కూడిన విజువల్స్ ఈ సినిమా అట్టహాసాన్ని చూపిస్తున్నాయి.
ఇప్పటివరకు చూసిన శివకార్తికేయన్ మూవీలతో పోలిస్తే ఇది పూర్తిగా డిఫరెంట్‌గా కనిపిస్తోంది. మురగదాస్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ పోస్టర్‌కి ఓ రేంజ్ క్రేజ్ తీసుకొచ్చాయి. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై ఎన్.శ్రీలక్ష్మి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఎప్పుడూ తన స్టైల్ సినిమాలకు పేరుగాంచిన ఏఆర్ మురగదాస్, ఈసారి కూడా ఓ పవర్‌ఫుల్ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని సమాచారం.
ఇందులో కథ, కథనంలోకి ముంబై మాఫియా కనెక్షన్ ఉండొచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. ఈసారి శివకార్తికేయన్ పాత్ర చాలా బ్రూటల్‌గా ఉండబోతోందట. ఇక ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నది రాక్ స్టార్ అనిరుధ్. ఇప్పటికే అనిరుధ్ శివకార్తికేయన్ కాంబోలో ఎన్నో హిట్స్ వచ్చాయి. అందుకే మదరాసి ఆల్బమ్‌పై కూడా భారీ అంచనాలున్నాయి. యాక్షన్ డ్రామా అయినా కూడా పాటల్లో తన మ్యాజిక్ చూపిస్తాడని అభిమానులు నమ్ముతున్నారు. త్వరలోనే సాంగ్ ప్రమోషన్స్ ప్రారంభమయ్యే అవకాశముంది. ఇక తమిళం, తెలుగు భాషల్లో భారీగా రిలీజ్ కానున్న ఈ చిత్రంఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.