ఒకేసారి బాబాయి-అబ్బాయి సినిమాలో దసరా స్టార్‌!

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా రూపొందిన 'దసరా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మలయాళ నటుడు షైన్‌ టామ్‌ చాకో.

Update: 2024-03-12 05:56 GMT

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా రూపొందిన 'దసరా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మలయాళ నటుడు షైన్‌ టామ్‌ చాకో. ఈయన మొదటి సినిమాతోనే నటుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. టాలీవుడ్‌ కి మరో మంచి విలన్ దొరికాడు అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.


అనుకున్నట్లుగానే షైన్‌ టామ్‌ చాకో కి టాలీవుడ్‌ పెద్ద సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమా లో ఈయన నటిస్తున్నాడు. ఆ మధ్య షూటింగ్ లో పాల్గొంటున్నట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చిన విషయం తెల్సిందే.

మరో రెండు మూడు తెలుగు సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు ఇటీవల ఆయన ఒక చిట్ చాట్‌ లో పేర్కొన్నాడు. అందులో ఒకటి బాలయ్య 109వ సినిమాగా తెలుస్తోంది. బాలయ్య, బాబీ కాంబోలో రూపొందుతున్న మూవీలో ఈ విలక్షణ నటుడు కనిపించబోతున్న ట్లు సమాచారం అందుతోంది.

ఇప్పటికే బాలయ్య, బాబీ మూవీలో బాబీ డియోల్‌ ను కీలక పాత్రలో నటింపజేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇప్పుడు షైన్‌ టామ్ చాకో కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో సినిమా స్థాయి మరింత పెరిగినట్లు అయ్యింది. ఈ విషయమై అధికారికంగా క్లారిటీ వచ్చే వరకు వెయిట్‌ చేయాల్సిందే.

Tags:    

Similar News