స‌నాతన ధ‌ర్మ ప్ర‌చారంలో న‌టికి ప్ర‌వేశం లేదు

సాగ‌ర‌క‌న్య శిల్పాశెట్టి ఏ వేదిక‌పై ఉన్నా అక్క‌డ త‌నే కేంద్ర‌క ఆక‌ర్ష‌ణ‌గా మారుతుంది. ఇప్పుడు ఈ కేంద్ర‌క ఆక‌ర్ష‌ణ కాస్తా అనుచిత కామెంట్ల‌కు కార‌ణ‌మైంది. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే.. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లాలి.;

Update: 2025-11-16 21:30 GMT

సాగ‌ర‌క‌న్య శిల్పాశెట్టి ఏ వేదిక‌పై ఉన్నా అక్క‌డ త‌నే కేంద్ర‌క ఆక‌ర్ష‌ణ‌గా మారుతుంది. ఇప్పుడు ఈ కేంద్ర‌క ఆక‌ర్ష‌ణ కాస్తా అనుచిత కామెంట్ల‌కు కార‌ణ‌మైంది. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే.. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లాలి.

బాలీవుడ్ స్టార్లు శిల్పా శెట్టి, ఏక్తా కపూర్, రాజ్‌పాల్ యాదవ్ మధురలో జరిగిన బాగేశ్వర్ బాబా సనాతన్ హిందూ ఏక్తా పాదయాత్రకు హాజరైన వీడియోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి. వీరంతా స్వ‌చ్ఛందంగా ఈ యాత్ర‌లో పాల్గొన్నారు. అభిమానులు వారిని అక్కడ చూసి ఆనందించారు. వీడియోల‌లో రాజ్‌పాల్ వేదికపై కూర్చుని క‌నిపించ‌గా, తరువాత శిల్పా అతడితో కలిసి స‌మీపంలోనే కూర్చుంది. ఫోటోలో శిల్పా - రాజ్‌పాల్ మధ్య ఏక్తా క‌పూర్ కూడా కూర్చుని క‌నిపించింది.

ఇదే వీడియోలో బాబా శిష్యుడు తమతో కథకుడు, కళాకారుడు, జర్నలిస్ట్ చేరారని ప్రకటించాడు. ప్రముఖ జర్నలిస్ట్ శ్రీవర్ధన్ త్రివేది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాగేశ్వర్ బాబా సనాతన్ హిందూ ఏక్తా పాదయాత్రను స్థాపించారు. ఇది 7 నవంబర్ 2025న ఢిల్లీలో ప్రారంభమైంది. 16 నవంబర్ 2025న బృందావనంలో ముగుస్తుంది.

అయితే ప‌విత్రమైన ఈ హిందూ స‌నాత‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్న శిల్పాశెట్టిని చూసాక‌, కొంద‌రు ట్రోల్ చేయ‌డం ప్రారంభించారు. శిల్పాశెట్టి భ‌ర్త ర‌హ‌స్య కార్య‌క‌లాపాలు, జైలు జీవితాన్ని ప్ర‌స్థావిస్తూ త‌న‌ను నిందించే ప్ర‌య‌త్నం చేసారు. శిల్పాశెట్టి కుంద్రాపై ఇటీవ‌ల కొన్ని ఆర్థిక నేరాల‌కు సంబంధించిన కేసులు న‌మోదైన విష‌యాన్ని కూడా నిల‌దీస్తున్నారు. శిల్పా ఇలాంటి కార్య‌క్ర‌మాల‌కు ఎటెండ్ కాకూడ‌ద‌ని కూడా కొంద‌రు జ‌డ్జిమెంట్ ఇచ్చారు. అయితే స‌మ‌స్య ఏమిటంటే, అస‌లు ఈ కార్య‌క్ర‌మంలో శిల్పాశెట్టి పాల్గొన‌డానికి రాజ్ కుంద్రాకు సంబంధం ఏమిటి? వ్య‌క్తిగ‌త ఆస‌క్తులు వేరు.. కోర్టు గొడ‌వ‌లు వేరు.. కుంద్రా వ్య‌వ‌హారం కోర్టు చూసుకుంటుంది. దానితో ముడిపెడుతూ శిల్పాశెట్టిని నిషేధించాల‌ని అనుకోవ‌డం స‌రైన‌దేనా? సామాజికంగా తాను త‌న‌కు న‌చ్చిన వ్య‌వ‌హారాల‌లో పాల్గొన‌డానికి హ‌క్కులు లేవా? అని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు.

1993లో బాజిగర్ తో అరంగేట్రం చేసిన శిల్పా శెట్టి బాలీవుడ్ లో అగ్ర న‌టిగా ఎదిగింది. ఆ త‌ర్వాత టాలీవుడ్ లోను ప‌లు చిత్రాల్లో న‌టించింది. ఈ బ్యూటీ వ్యవస్థాపకురాలిగాను నిరూపించుకుంది. శిల్పాజీ రెస్టారెంట్ చైన్ బాస్టియన్ కు సహ యజమాని. 2020లో దుస్తుల వ్యాపారంలోను ప్ర‌వేశించింది. శిల్పా 2009లో వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకుంది..వారికి ఇద్దరు పిల్లలు వియాన్ - సమీషా ఉన్నారు. ఆమె చివరిగా డ్యాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ చాప్టర్ 5లో జడ్జిగా కనిపించింది. బాలాజీ టెలీఫిలింస్ అధినేత్రి ఏక్తాక‌పూర్ కి శిల్పా శెట్టి మంచి స్నేహితురాలు అన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News