వెంకీ మామ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ `దృశ్యం`.;
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ `దృశ్యం`. మలయాళంలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీకి సంబంధించిన రీమేక్‌లు, సిరీస్‌లు అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచి థార్డ్ ఇన్స్‌స్టాల్‌మెంట్‌లపై అంచనాల్ని పెంచేసింది. ఈ సిరీస్‌లో ఇప్పటికే దృశ్యం, దృశ్యం 2 ప్రేక్షకుల ముందుకొచ్చాయి. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రెండు భాగాలు రీమేక్ అయి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌లుగా నిలిచాయి.
తమిళంలో కేవలం ఫస్ట్ పార్ట్ మాత్రమే రీమేక్ చేశారు. రెండవ భాగం రీమేక్ చేయలేదు. ఇప్పుడు మూడవ భాగం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మోహన్‌లాల్, మీనా జంగటా జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయిపోయింది. `గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు `దృశ్యం 3` రాబోతోంది` అంటూ మూడవ భాగాన్ని ప్రకటించిన టీమ్ రాకెట్ స్పీడుతో షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ మూవీని ఏప్రిల్ 2న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నామంటూ ఇటీవల డైరెక్టర్ జీతూ జోసెఫ్ ప్రకటించడం తెలిసిందే.
అయితే హిందీ వెర్షన్‌కు ఈ కథ కాకుండా బాలీవుడ్ వర్గాలు కొత్త కథతో చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తాను అందించిన కథకే హిందీ నేటివిటీకి కొన్ని మార్పులు చేసి రూపొందిస్తున్నారని. దీన్ని అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని దర్శకుడు క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడు అందరి దృష్టి తెలుగు రీమేక్‌పై పడింది. అయితే మక్షమన్ లాల్ సినిమాలు తెలుగులోనూ డబ్ అయి విజయవంతం అవుతున్న నేపథ్యంలో `దృశ్యం 3`ని వెంకటేష్ తెలుగులో రీమేక్ చేయకపోవచ్చనే కామెంట్‌లు వినిపించాయి.
వెంకీ టీమ్ నుంచి కూడా ఇంత వరకు ఈ రీమేక్‌కు సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో ఇక తెలుగులో `దృశ్యం 3` రీమేక్ లేనట్టేనని అంతా భావించారు. కానీ అది నిజం కాదని తెలుస్తోంది. ఈ మూవీ తెలుగు రీమేక్‌కు సంబంధించిన వర్క్ జూలైలో మొదలవుతుందని, అప్పుడే షూటింగ్ కూడా మొదలు పెడతారని తెలిసింది. మలయాళ `దృశ్యం 3`కి సంబంధించిన రిలీజ్ ఫార్మాలీటీస్ పూర్తి చేసుకున్న తరువాత దర్శకుడు జీతూ జోసెఫ్ తెలుగు రీమేక్ పనులు ప్రారంభిస్తారట.
`సంక్రాంతికి వస్తున్నాం` బ్లాక్ బస్టర్ తరువాత వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ రూపొందిస్తున్న `ఆదర్శకుటుంబం హౌస్ నం.47`లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ తరువాతే వెంకటేష్ `దృశ్యం 3` షూటింగ్‌కు డేట్స్ కేటాయిస్తాడట. జూన్, జూలై వరకు `ఆదర్శకుటుంబం హౌస్ నం.47` చాలా వరకు షూటింగ్ పూర్తవుతుంది కాబట్టి `దృశ్యం 3`ని స్టార్ట్ చేయాలనే ఆలోచనలో టీమ్ ఉన్నట్టుగా ఇన్ సైడ్ టాక్.