ఆ పాట కొరియోగ్రఫీపై ఆక్షేపణ.. స్వయంగా ఒప్పుకున్న కొరియోగ్రాఫర్
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన భారీ చిత్రం `డాకు మహారాజ్` లోని `దబిడి దిబిడి` సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన భారీ చిత్రం `డాకు మహారాజ్` లోని `దబిడి దిబిడి` సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ పాటలోని ఒక వివాదాస్పదమైన డ్యాన్స్ స్టెప్‌పై సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. తాజాగా ఈ కాంట్రవర్సీ స్టెప్‌పై టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ స్పందిస్తూ.. ఆ స్టెప్ కంపోజ్ చేసినందుకు తానెంతో పశ్చాత్తాపపడుతున్నట్లు (రిగ్నెట్ అవుతున్నట్లు) సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత రెండు దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో ఐకానిక్ - సూపర్ హిట్ సాంగ్స్‌కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. `ఇద్దరమ్మాయిలతో` చిత్రంలో `టాప్ లేచిపోద్ది`, `ఖైదీ నెంబర్ 150` లో `అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు`, `లవ్ స్టోరీ`లో `సారంగ దరియా`. `అల వైకుంఠపురములో` చిత్రంలో `రాములో రాములా` వంటి ఆల్-టైమ్ చార్ట్‌బస్టర్ పాటలు ఆయన ఖాతాలోనే ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో మాస్టార్ పేరు ఒక వివాదాస్పదమైన డ్యాన్స్ మూమెంట్ ద్వారా వార్తల్లో నిలవడం చర్చనీయాంశమైంది.
`దబిడి దిబిడి` పాటలోని ఆ ప్రత్యేకమైన స్టెప్ గురించి శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. `డాకు మహారాజ్ లోని ఆ స్టెప్ చేసినందుకు నేను నిజంగానే రిగ్రెట్ ఫీలవుతున్నాను. ఒక మాస్ స్పెషల్ సాంగ్‌కు ఏది అవసరమో అదే ఉద్దేశంతో నేను కంపోజ్ చేశాను. ఆ స్టెప్ వేరేలా రిసీవ్ చేసుకుంటారని.. ప్రేక్షకులకు నచ్చుతుందని నేను భావించాను. కానీ, దురదృష్టవశాత్తు జనాలు దానిని మరొక రకంగా అర్థం చేసుకోవడంతో అది తీవ్రంగా ట్రోలింగ్‌కు గురై బాగా వైరల్ అయ్యింది`` అని వివరించారు.
అయితే ఆ పాటలోని డ్యాన్స్ మూమెంట్స్ ఎంత వైరల్ అయినా దాని వెనుక ఉన్న కొరియోగ్రాఫర్ తానేననే విషయం చాలామందికి తెలియదని ఆయన పేర్కొన్నారు. ``ఈ రోజుల్లో ఆ స్టెప్ గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు.. కానీ ఆ పాటకు కొరియోగ్రఫీ చేసింది నేనే అన్న విషయం మాత్రం చాలామందికి తెలియదు`` అని శేఖర్ మాస్టర్ సరదాగా వ్యాఖ్యానిస్తూనే.. తన అసంతృప్తిని బయటపెట్టారు.
సినిమా రంగంలో ప్రయోగాలు చేసేటప్పుడు కొన్నిసార్లు ఫలితాలు ఊహించని విధంగా ఉంటాయని ఈ ఘటన నిరూపించింది. ఏది ఏమైనా తన తప్పును లేదా విమర్శలను స్వీకరించి.. బహిరంగంగా స్పందిస్తూ `రిగ్రెట్` ఫీలవ్వడం శేఖర్ మాస్టర్ నైజానికి అద్దం పడుతోంది. భవిష్యత్తులో నందమూరి అభిమానులకు.. తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా మరింత అద్భుతమైన కొరియోగ్రఫీతో అలరిస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.