కాంటాలాగా గర్ల్ డెత్: యవ్వనం కోసం వాడిన మందులే చంపాయి?
కాంటాలాగా గర్ల్ డెత్ కేసులో మిస్టరీ దాగి ఉందా? ఈ ప్రశ్నకు ఇంకా సరైన సమాధానం లేదు. మీడియాలో కానీ, పోలీసు వర్గాల నుంచి కానీ ఇంకా అధికారిక కథనాలేవీ వెలువడలేదు;
కాంటాలాగా గర్ల్ డెత్ కేసులో మిస్టరీ దాగి ఉందా? ఈ ప్రశ్నకు ఇంకా సరైన సమాధానం లేదు. మీడియాలో కానీ, పోలీసు వర్గాల నుంచి కానీ ఇంకా అధికారిక కథనాలేవీ వెలువడలేదు. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ కానీ, ఫోరెన్సిక్ నివేదికలు కానీ ఇంకా బయటికి రాలేదు. కానీ కొన్ని స్పెక్యులేటెడ్ కథనాలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. నటి కం మోడల్ షెఫాలీ జరివాలా గుండెపోటు కారణంగా 42 సంవత్సరాల వయసులో మరణించారనేది ప్రాథమిక నివేదిక. దీనిపై పోలీసుల, వేలి ముద్రల నిపుణుల దర్యాప్తు ప్రారంభమైంది. అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కథనాలొచ్చాయి. అయితే ఇంకా ఈ దర్యాప్తు పూర్తి కాలేదు.
తాజాగా కొన్ని బాలీవుడ్ మీడియాల కథనాల్లో షెఫాలి మరణం సహజమరణమేనని ధృవీకరిస్తూ కొన్ని వార్తలను ప్రచురించారు. షెఫాలి కి వైద్యం అందిస్తున్న ప్రముఖ వైద్యుడు ఏబీపీ న్యూస్ తో మాట్లాడారు. షెఫాలీకి ఎటువంటి తీవ్రమైన అనారోగ్యం కానీ, వైద్యం చేయాల్సిన అవసరం కానీ లేవు... కానీ గత ఐదు-ఆరు సంవత్సరాలుగా యాంటీ ఏజింగ్ చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. జారివాలాకు ప్రమాదకరమైన గుండె జబ్బులు లేవని, ఎల్లప్పుడూ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకునేవారని డాక్టర్ వెల్లడించారు. అలాగే ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ ``శవపరీక్ష జరిగింది, కానీ మరణానికి గల కారణంపై అభిప్రాయం రిజర్వ్ చేసారు`` అని తెలిపారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా, ఇది సహజ మరణంలాగే కనిపిస్తుంది.. ఎటువంటి అక్రమ సంబంధం లేదు అంటూ కొన్ని బాలీవుడ్ మీడియాలు ఊహాజనిత కథనాలను ప్రచురించాయి. ఒక వైద్యుని ప్రకారం.. యాంటీ ఏజింగ్ చికిత్సలో విటమిన్ సి, గ్లూటాతియోన్ అనే ఔషధం వాడకం ఉంటుంది.
గ్లూటాతియోన్ ఔషధం అంటే ఏమిటి
గ్లూటాతియోన్ కణజాల నిర్మాణం, మరమ్మత్తులో, శరీరంలో అవసరమైన రసాయనాలు, ప్రోటీన్లను తయారు చేయడంలో, రోగనిరోధక వ్యవస్థ పనితీరులో సహకరిస్తుంది. వృద్ధాప్యం, ఆల్కహాల్ వాడకంలో లోపాలు, కాలేయ వ్యాధి, గుండె జబ్బులు వంటి వాటిని నివారించేందుకు ప్రజలు గ్లూటాతియోన్ తీసుకుంటారు, అయితే దీనికి నమ్మదగిన శాస్త్రీయ ఆధారాలు అయితే ఇప్పటికీ లేవు.
వృద్ధాప్య వ్యతిరేక ఉత్పత్తుల దుష్ప్రభావాల గురించి పత్రికలలో చాలా కథనాలు గతంలో వచ్చాయి. కొంతమందికి కొన్ని పదార్థాలకు చికాకు లేదా అలెర్జీ వంటివి ఇబ్బంది పెట్టొచ్చు. కొన్ని వృద్ధాప్య వ్యతిరేక ఉత్పత్తులు చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. వృద్ధాప్యాన్ని ఆపే ఉత్పత్తులను అందించే పరిశ్రమపై నియంత్రణ లేకపోవడం ప్రధాన సమస్య. ఇది నటి గుండెపోటుకు దారితీసి ఉండొచ్చని కూడా ఒక ఊహాజనిత కథనం వెలువడింది. అయితే ఇవన్నీ కేవలం స్పెక్యులేషన్స్ మాత్రమే. నిజానిజాల్ని పోలీసులు అధికారికంగా నిగ్గు తేల్చాల్సి ఉంది. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులను అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది.