• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చరణ్ హీరోయిన్‌ పెళ్లి...

చరణ్ హీరోయిన్‌ పెళ్లి ఫిక్స్‌

| ఇప్పుడు ఆరంజ్‌ సినిమా సెకండ్‌ హీరోయిన్‌ షాజన్ పదంసి గురించి మీడియాలో చర్చ జరుగుతోంది.

By - Tupaki Desk
Update: 2024-11-16 16:38 GMT

రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన ఆరంజ్‌ సినిమా ఎంతటి ఫ్లాప్‌ అయినా ఆ సినిమా గురించి ఎప్పుడూ మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఆ మధ్య సినిమా రీ రిలీజ్ అయ్యి మంచి వసూళ్లు సొంతం చేసుకుంది. అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్ ఆరంజ్‌ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ జనరేషన్‌ కి ఆరంజ్ సినిమా బాగా ఏక్కేది. ఇప్పుడు చరణ్ ఆ సినిమా చేసి ఉంటే కచ్చితంగా మూడు నాలుగు వందల కోట్ల వసూళ్లు నమోదు చేసి ఉండేది అంటూ కొందరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆరంజ్‌ సినిమా సెకండ్‌ హీరోయిన్‌ షాజన్ పదంసి గురించి మీడియాలో చర్చ జరుగుతోంది.

ఆరంజ్ సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌గా జెనీలియా నటించింది. ఆమె నటన ఓవర్‌ అయిందని కొందరు, పాత్రకు తగ్గట్లు భలే నటించింది అంటూ మరి కొందరు కామెంట్స్ చేశారు. అయితే షాజన్‌ పదంసికి మాత్రం చాలా పాజిటివ్‌ మార్కులు దక్కాయి. ఆమెకు మంచి స్పందన వచ్చింది. ఆరంజ్ సినిమా తర్వాత తెలుగులో మరిన్ని తెలుగు సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు. కానీ షాజన్‌ పదంసి బాలీవుడ్‌ కి పరిమితం అయ్యింది. ఇన్నాళ్లు వార్తల్లో లేని ఈమె తన వివాహ నిశ్చితార్థం తో వార్తల్లో నిలిచింది.

షాజన్‌ పదంసి రణబీర్‌ కపూర్‌ తో నటించిన రాకెట్‌ సింగ్‌ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత బాలీవుడ్‌లో కొన్ని మంచి సినిమాలను చేయడం ద్వారా అమ్మడికి మంచి పేరు దక్కింది. మొన్నటి వరకు ఏదో ఒక సినిమా లేదా సిరీస్‌, షో ల్లో కనిపిస్తూ వచ్చిన షాజన్ పదంసి తాజాగా ప్రముఖ మల్టీప్లెక్స్‌ సంస్థ మ్యాక్స్‌ మూవీస్‌ సీఈఓ ఆశిష్‌ కనాకియా తో పెళ్లికి సిద్దం అయింది. మంచి బిజినెస్ మెన్‌గా పేరు ఉన్న ఆశిష్‌ తో గత కొంత కాలంగా షాజన్‌ ప్రేమ వ్యవహారం సాగిస్తోందని సమాచాం అందుతోంది. ఇటీవల వీరి పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది.

షాజన్‌ తో ఆశిష్‌ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నా బయటి వ్యక్తులకు లీక్ కాకుండా డీసెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు వారి స్వయంగా నిశ్చితార్థంకు సంబంధించిన విషయాన్ని ప్రకటించిన తర్వాత వారి విషయమై క్లారిటీ వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో దాదాపు పుష్కర కాలంకు పైగా మంచి లీడ్‌ పాత్రల్లో నటించిన షాజన్ పదంసి ఇక మీదట నటిస్తుందా లేదా అనేది చూడాలి. హీరోయిన్‌గా ఆఫర్లు తగ్గిన ఈ సమయంలో షాజన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్న నేపథ్యంలో ఆమె నటించే అవకాశాలు తక్కువే అంటున్నారు. అయితే కొన్నాళ్ల తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలు పెట్టి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తుందేమో చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Filmindustry 
  • Orange 
  • Shazahnpadamsee 
  • Marriage 
  • Rocketsingh 
  • Ranbirkapoor 
  • AshishKanakia 
  • Ceo 
  • MaxMovies 

Similar News

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS