సంక్రాంతి సెంటిమెంట్.. ఈసారి కూడా శర్వాకు కలిసొస్తుందా?
నప్పటికీ చిన్న సినిమా అయినా సరే, ఎంటర్టైన్మెంట్, ఫ్రెష్ నెస్, శర్వానంద్ టైమింగ్ కలిసి ఎక్స్ ప్రెస్ రాజాను సూపర్ హిట్ గా నిలిపాయి.;
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కు సంక్రాంతి సీజన్ తో స్పెషల్ రిలేషన్ ఉన్న విషయం తెలిసిందే. గతంలో సంక్రాంతికి విడుదలైన ఆయన సినిమాలు మంచి విజయాలు సాధించడంతో, ఇప్పుడు మరోసారి అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. తాజాగా శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి కూడా 2026 సంక్రాంతికి విడుదల అవుతుండడంతో ఇండస్ట్రీతోపాటు ప్రేక్షకుల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.
శర్వానంద్ కెరీర్ ను చూసుకుంటే.. సంక్రాంతి సీజన్ లో ఆయనకు ఇప్పటికే రెండు హిట్లు దక్కాయి. ముఖ్యంగా భారీ స్టార్ హీరోల సినిమాలతో పోటీ ఉన్నా కూడా తన సినిమాలతో హిట్స్ అందుకున్నారు. 2016 సంక్రాంతికి విడుదలైన ఎక్స్ ప్రెస్ రాజా ఫస్ట్ ఎగ్జాంపుల్. ఆ సమయంలో నందమూరి బాలకృష్ణ డిక్టేటర్, నాగార్జున సోగ్గాడే చిన్నినాయనా, జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో వంటి భారీ సినిమాలు థియేటర్లలో ఉన్నాయి.
అయినప్పటికీ చిన్న సినిమా అయినా సరే, ఎంటర్టైన్మెంట్, ఫ్రెష్ నెస్, శర్వానంద్ టైమింగ్ కలిసి ఎక్స్ ప్రెస్ రాజాను సూపర్ హిట్ గా నిలిపాయి. అదే తరహాలో 2017 సంక్రాంతికి వచ్చిన శతమానం భవతి కూడా శర్వానంద్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్. ఆ ఏడాది చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150, బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి వంటి భారీ సినిమాల మధ్య విడుదలైనప్పటికీ, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుని ఘన విజయం సాధించింది.
అంతేకాదు నేషనల్ అవార్డు రావడం శర్వానంద్ ఇమేజ్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. దీంతో సంక్రాంతి అంటే శర్వానంద్ కు లక్కీ సీజన్ అన్న భావన అందరిలో ఏర్పడింది. ఇప్పుడు అదే నమ్మకంతో నిర్మాత అనిల్ సుంకర.. నారీ నారీ నడుమ మురారి సినిమాను జనవరి 14వ తేదీన గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తుండడం విశేషం.
ఆయన చివరగా తెరకెక్కించిన సామజవరగమన మంచి హిట్ కావడంతో, శర్వా కొత్త సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా ప్రమోషనల్ కంటెంట్ కు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ ఆసక్తి పెంచుతోంది. టీజర్, ట్రైలర్ సహా అన్నీ సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే ఎంటర్టైనర్ గా సినిమా రూపొందుతున్నట్లు ప్రమోషనల్ కంటెంట్ ద్వారా క్లియర్ గా తెలుస్తోంది.
ఇక సినిమాలో శర్వాతో పాటు సంయుక్త మీనన్, సాక్షి వైద్య లీడ్ రోల్స్ లో నటిస్తుండగా, యంగ్ హీరో శ్రీ విష్ణు క్యామియో రోల్ లో సందడి చేయనున్నారు. దీంతో క్యాస్టింగ్ కూడా సినిమాకు ప్లస్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి శర్వాకు సంక్రాంతి సీజన్ ఇప్పటికే రెండుసార్లు కలిసొచ్చింది. మరి ఈసారి అదే సెంటిమెంట్ ఆయనకు వర్కౌట్ అవుతుందో లేదో.. మరేం జరుగుతుందో వేచి చూడాలి.