‘బా బా బ్లాక్ షీప్’ టీజర్: మిస్టరీ బాక్స్ కోసం క్రేజీ వేట!
టాలీవుడ్‌లో ఇప్పుడు క్రైమ్ కామెడీల ట్రెండ్ నడుస్తోంది. లేటెస్ట్ గా అదే జోనర్‌లో వస్తున్న సినిమా ‘బా బా బ్లాక్ షీప్’.;
టాలీవుడ్‌లో ఇప్పుడు క్రైమ్ కామెడీల ట్రెండ్ నడుస్తోంది. లేటెస్ట్ గా అదే జోనర్‌లో వస్తున్న సినిమా ‘బా బా బ్లాక్ షీప్’. ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఫుల్ జోష్‌లో ఉన్న శర్వానంద్, వసంత పంచమి సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు. టీజర్ చూస్తుంటేనే ఇది ఒక స్టైలిష్ అండ్ ఫన్నీ రైడ్‌లా ఉండబోతోందని అర్థమవుతోంది. మేకర్స్ విజువల్స్ అండ్ మేకింగ్ విషయంలో అస్సలు తగ్గలేదని టీజర్ ప్రూవ్ చేస్తోంది.
ఈ సినిమా కథ అంతా ఒక మిస్టరీ బాక్స్ చుట్టూ తిరుగుతుంది'. ఆ బాక్స్ ఎక్కడుంది? దాని కోసం గ్యాంగ్ ఎలా వెతుకుతోంది? అనేదే అసలు మ్యాటర్. గన్స్, గోల్డ్ గందరగోళం కలగలిసిన ఈ కథలో ఆరుగురు విభిన్నమైన వ్యక్తులు చేసే వేట చాలా ఫన్నీగా ఉండబోతోంది. ఒక ఫ్లాంబోయంట్ గ్యాంగ్‌స్టర్, అతనికి అస్సలు సెట్ అవ్వని ఫ్రెండ్స్, వింతగా ప్రవర్తించే క్రిమినల్స్ మధ్య జరిగే ఈ ఛేజింగ్ గేమ్ ఆడియన్స్‌కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని టీజర్ హింట్ ఇచ్చింది.
దర్శకుడు గుని మంచికంటి ఈ క్రైమ్ ప్లాట్‌ను చాలా తెలివిగా డిజైన్ చేశారు. మనుషుల్లో ఉండే అత్యాశ క్రైమ్ వల్ల జరిగే పొరపాట్లను కామెడీగా చూపించడమే ఈ సినిమా మెయిన్ థీమ్. పంచ్ డైలాగులు ఈ మూవీకి హైలైట్‌గా నిలుస్తాయని నిర్మాత వేణు దోనేపూడి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తరుణ్ భాస్కర్ ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసి సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశారు.
ఇక ఈ సినిమాకు ఉన్న మరో క్రేజీ స్పెషాలిటీ ఏంటంటే.. టోటల్ గా మేఘాలయలో షూట్ చేసిన ఫస్ట్ మూవీ ఇదే. ఈ ఈశాన్య రాష్ట్రంలోని అందమైన లొకేషన్లు ప్రకృతి సౌందర్యాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. మేఘాలయ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్ట్‌కు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. అక్కడి సీఎం కాన్రాడ్ కె సంగ్మా కూడా ఈ సినిమా ద్వారా తమ రాష్ట్ర పర్యాటక రంగం డెవలప్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రకృతి ఒడిలో సాగే ఈ క్రైమ్ డ్రామా విజువల్ గా ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుందట.
చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ సినిమాలో టిన్నూ ఆనంద్, ఉపేంద్ర లిమాయే, జార్జ్ మరియన్ వంటి సీనియర్లు నటిస్తున్నారు. అలాగే అక్షయ్ లాగుసాని, విష్ణు ఓయ్ లాంటి యంగ్ టాలెంట్ కూడా ఉంది. అజయ్ అబ్రహం జార్జ్ సినిమాటోగ్రఫీ, ఆనంద్ అందించిన మ్యూజిక్ టీజర్‌లో అదిరిపోయాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా సమ్మర్ రేసులోకి రావడానికి సిద్ధమవుతోంది. 'బా బా బ్లాక్ షీప్' టీజర్ ఒక వెరైటీ క్రైమ్ కామెడీని ప్రామిస్ చేస్తోంది. బాక్స్ దొరుకుతుందా? లేదా? ఈ ఆరుగురిలో విన్నర్ ఎవరు? అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.