NNNM ట్రైలర్:లైఫ్..వైఫ్..ఏ హై ఎండ్ కామిక్ రైడ్!
సంక్రాంతి బరిలో ఫ్యామిలీ కామెడీ డ్రామాలు రిలీజ్ అవుతున్నా దేనికదే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అందులో శర్వా `నారీ నారీ నడుము మురారి` కూడా ఒకటి.;
శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న పక్కా ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్ టైనర్ `నారీ నారీ నడుమ మురారి`. రామ్ అబ్బరాజు దర్శకుడు. ఏకె ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. సంయుక్త మీనన్, సాక్షీ వైద్య హీరోయిన్‌లు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. సంక్రాంతి బరిలో ఫ్యామిలీ కామెడీ డ్రామాలు రిలీజ్ అవుతున్నా దేనికదే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అందులో శర్వా `నారీ నారీ నడుము మురారి` కూడా ఒకటి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది.
మాజీ ప్రేయసి..ప్రజెంట్ లవర్ మధ్య నలిగిపోయే యువకుడి కథగా ఆద్యంతం వినోదాత్మకంగా దర్శకుడు రామ్ అబ్బరాజ్ తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. సినిమా రిలీజ్‌కు టైమ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఆదివారం ట్రైలర్‌ని విడుదల చేశారు. విజువల్స్, సన్నివేశాలు.. వాటి నేపథ్యంలో వచ్చే కామెడీ వెరసి ఇదొక హై ఎండ్ కామిక్ రైడ్‌గా ఈ పండక్కి ప్రేక్షకుల్ని ఆద్యంతం వినోదంతో ఎంటర్‌టైన్ చేసేలా ఉందని స్పష్టమవుతోంది. ట్రైలర్ స్టారింగ్ టు ఎండ్ వరకు ప్రతి సీన్‌లోనూ కమెడీ టచ్‌తో సాగే డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి.
హీరో శర్వానంద్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు.. ఆ క్వశ్చన్‌కి నేనే కాదు.. బీటెక్ చదివిన ఏ కుర్రాడూ ఆన్సర్ చెప్పలేడు..`, నా లైఫ్..నా వైఫ్ నీ చేతుల్లో ఉంది..` అంటూ చెప్పే డైలాగ్‌లు.. చెత్తకుప్పలకీ సెప్టిక్ ట్యాంక్‌లకి దూరంగా ఉండాలమ్మా మనం.. అంటూ శ్రీకాంత్ అయ్యంగార్ వేసే పంచ్‌లు.. రాజాగారి పాటొద్దులే మామా కేసులేస్తున్నాడంటా.., కాదండీ మళ్లీ పెళ్లి..` వంటి సెటైర్లతో సాగుతూ ఫుల్ ఫన్ రైడ్ ఫీల్‌ని కలిగిస్తోంది. ఇందులో శర్వానంద్‌కు ఫాదర్‌గా సీనియర్ నరేష్ నటిస్తున్నాడు. కూతురు వయసున్న అమ్మాయిని మళ్లీ పెళ్లి చేసుకునే క్యారెక్టర్ ఇది. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించడం ఖాయంగా కనిపిస్తోంది.
రెండో పెళ్లి చేసుకుని తనకు అబ్బాయి పుడితే ఆ అబ్బాయి కొడుకుతో ఆడుకోవాలని ఆశపడే తండ్రి.. మాజీ లవర్‌కు, ప్రజెంట్ లవర్‌కు మధ్య ఇరుక్కుపోయి నానా తంటాలు పడే తండ్రి.. ఇలాంటి విచిత్రమైన ఫ్యామిలీ వ్యక్తిని తన కూతురుఎలా ప్రేమించిందని ఇరిటేట్ అయ్యే తండ్రి.. వీరి నేపథ్యంలో వచ్చే ఫసన్ అండ్ ఫ్రస్టేషన్ ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తోంది. ట్రైలర్‌లోని ప్రతి సీన్‌తో సినిమా ఎలా ఉండబోతోందో జస్ట్ షాంపిల్ చూపించిన రామ్ అబ్బరాజ్ థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు ఈ మూవీతో హై ఎండ్ కామిక్ రైడ్‌ని అందించబోతున్నాడని స్పష్టమవుతోంది.
హీరోయిన్‌ల ఫాదర్‌లుగా సంపత్ రాజ్, శ్రీకాంత్ అయ్యంగార్ నటించారు. వీరి పంచ్‌లతో పాటు, సత్య, సుదర్శన్‌ల వన్ లైనర్స్, సినిమాని దర్శకుడు ఫుల్ ఫన్ మూడ్‌లో తెరకెక్కించిన విధానం ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేసేలా ఉంది. ఫైనల్‌గా ట్రైలర్ ని బట్టి చూస్తుంటే కొత్త జానర్‌ని ఎంచుకున్నశర్వానంద్ ఈ సినిమాతో ఫ్యామిలీ ప్రేక్షకుల్ని కచ్చితంగా అలరించి మంచి సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకుంటాడనే వైబ్ క్రియేట్ అవుతోంది.